AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కార్తీక మాసం చివరి రోజున అద్భుతం.. శంఖంను పోలిన కంద దుంప సాక్షాత్కారం..

Viral News: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాల్లో కార్తీక మాసం ఒకటి. నెల రోజుల పాటు పరమ శివుడిని దీపాలతో పూజిస్తూ ఆ దేవ దేవుడి కృపకు పాతృలు కావడానికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు...

Viral News: కార్తీక మాసం చివరి రోజున అద్భుతం.. శంఖంను పోలిన కంద దుంప సాక్షాత్కారం..
Viral Photo
Narender Vaitla
|

Updated on: Dec 06, 2021 | 4:19 PM

Share

Viral News: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసాల్లో కార్తీక మాసం ఒకటి. నెల రోజుల పాటు పరమ శివుడిని దీపాలతో పూజిస్తూ ఆ దేవ దేవుడి కృపకు పాతృలు కావడానికి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇలా సాగిన ఈ పవిత్ర మాసం ఆదివారంతో ముగిసింది. అయితే ఆదివారం కార్తీక మాసం చివరి రోజున తూర్పు గోదావరి జిల్లాలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. శంకువుఉ పోలిన కంద దుంప దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా వాడపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం కాలువ రేవు దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుడు పెద్దింటి రామం భక్తులతో ప్రత్యేక పూజలు జరిపించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో పూజలు పెద్దఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ప్రజలు పూజకు హాజరయ్యారు. వీరిలో ఓ భక్తురాలు స్వయంపాకం కోసం బియ్యంతో పాటు పలు కూరగాయలు సమర్పించారు.

అయితే ఈ స్యయంపాకంలో ఉన్న వస్తువులను గమనించే క్రమంలో పూజారికి అద్భుత దృశ్యం కనిపించింది. అందులో ఉన్న కంద దుంప శంఖం ఆకారంలో కనిపించింది. దీంతో అక్కడనున్న వారంతా ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు ఆ విష్ణు మూర్తి దర్శనమిచ్చారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ కంద దుంప ఫోటోను కెమెరాలో బంధించిన స్థానికులు నెట్టింట వైరల్‌ చేస్తున్నారు.

Also Read: Twitter Audio: ఇకపై ట్వీట్లను చదవడమే కాదు, వినొచ్చు కూడా.. సరికొత్త ఫీచర్ తీసుకొస్తున్న ట్విట్టర్..

Virat Kohli: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. అన్ని ఫార్మట్లలో 50 విజయాలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు..

Sonu Sood: రియల్ హీరోకు మరోసారి షాక్.. అక్రమంగా హోటల్ నిర్మించారంటూ..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..