AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satya Sri: అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా : సత్య శ్రీ

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో లేడీ కమెడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. జబర్దస్త్ షోలో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వారిలో సత్య శ్రీ ఒకరు. జబర్దస్త్ లోనే కాదు పలు సినిమాల్లోనూ నటించింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో, హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రల్లో నటించింది సత్య శ్రీ

Satya Sri: అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా : సత్య శ్రీ
Satya Sri
Rajeev Rayala
|

Updated on: Oct 12, 2026 | 8:47 AM

Share

బుల్లితెరపై కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో పాటు హీరోయిన్ల స్నేహితురాలిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలోనూ హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో కనిపించి సందడి చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్య శ్రీ తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన స్కూల్, కాలేజీ రోజుల్లో చాలామంది తనకు ప్రపోజ్ చేశారని చేశారని సత్య శ్రీ తెలిపింది. అయితే తాను మాత్రం వాటికి అంగీకరించలేదని చెప్పుకొచ్చింది. తన తండ్రి, అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని, తమ కుటుంబం గురించి తెలిసినవారు తనతో మాట్లాడటానికి కూడా భయపడేవారని వెల్లడించింది.

ఒక వ్యక్తి పదేపదే తన వెంటపడటంతో తన తండ్రి జోక్యం చేసుకున్నారని, ఆ తర్వాత అతడు తన జోలికి రాలేదని గుర్తుచేసుకుంది. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఎవరూ తనకు ప్రపోజ్ చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపించిందని సరదాగా చెప్పింది. ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని సత్య శ్రీ స్పష్టం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను ఆలోచింపజేస్తున్నాయని తెలిపింది. అమ్మాయిల ఇష్టాలను పక్కనపెట్టి పెళ్లిళ్లు చేయడం, చదువులను మధ్యలోనే ఆపేయడం, చిన్న వయసులోనే వివాహాలు జరిపించడం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. మగవాడు సంపాదించాలి, ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలనే పాతకాలపు ఆలోచనలను తాను వ్యతిరేకిస్తానని చెప్పింది.

ఆడపిల్లలు కూడా తమ కుటుంబాలను పోషించగలరని, ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను తానే చూసుకుంటున్నానని వెల్లడించింది. ప్రస్తుతానికి తన చెల్లి పెళ్లి చేయడమే ప్రధాన లక్ష్యమని, తన దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉందని పేర్కొంది. ఇక ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన హీరోల్లో రామ్ పోతినేని ఒకరని సత్య శ్రీ తెలిపింది. ఆయన చాలా లవ్లీ బాయ్ అని చెప్పుకొచ్చింది. పండగ చేస్కో సినిమాలో ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో రామ్‌తో ఒక ఫోటో దిగాలని అడగడానికి కూడా చాలా కష్టపడ్డానని సరదాగా చెప్పింది. మొత్తానికి, పెళ్లి కంటే కెరీర్‌కు, కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్న సత్య శ్రీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్