AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరే సూపర్ న్యూస్.. రూ.49కే కేజీ బియ్యం.. ఎంత ఇస్తారంటే..?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో కిలో సన్నబియ్యం రూ.90 వరకు పలుకుతోంది. బస్తా కొనాలంటే రూ.2 వేల వరకు పడుతుంది. ఎల్‌నివో ప్రభావంతో బియ్యం ధరలు పెరగ్గా.. సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సబ్సిడీపై బియ్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం అదిరే సూపర్ న్యూస్.. రూ.49కే కేజీ బియ్యం.. ఎంత ఇస్తారంటే..?
Rice
Venkatrao Lella
|

Updated on: Oct 12, 2026 | 10:12 AM

Share

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. సన్న బియ్యంను తక్కువ ధరలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎల్‌నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఏపీలోనూ ధరలు పెరగ్గా.. దీని వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రజలకు భారం తగ్గించేందుకు రాయితీ ధరలపై సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా ప్రభుత్వం వీటిని అందించనుంది. రెండు రకాల బియ్యాన్ని సబ్సిడీపై పంపిణీ చేయనుంది. బీపీటీ బియ్యంను కిలో రూ.49కి అందించనుండగా.. కేఎన్‌ఎం బియ్యంను కిల రూ.50కి విక్రయించనున్నారు. ఒక్కొ కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్ బస్తాను మాత్రమపే అందిస్తారు.

అక్టోబర్ 12వ తేదీన ఉదయం 10.30 గంటలకు విజయవాడ భవానీపురంలోని రైతు బజార్లలో ఈ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో సన్నబియ్యం రూ.90 వరకు చేరుకుంది. ఎల్‌నివో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పంట సాగుకు రైతులు దూరమవ్వడంతో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీని ప్రభావంతో కూరగాయలు, కిరణా సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేదలకు ఖర్చుల భారం తగ్గించేందుకు రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఈ కౌంటర్ల ద్వారా బీపీటీ, కేఎన్‌ఎం రకానికి చెందిన బియ్యంను విక్రయిస్తారు. నాన్యమైన బియ్యంను తక్కువ ధరకే అందించనున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నెలకు ఒక్కొ కుటుంబానికి 26 కిలోల ఒక్కొ బ్యాగ్ అందిస్తారు.

ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అవసరమైనవారు మీ సమీపంలోని రైతు బాజర్లకు వెళ్లి తీసుకెళ్లవచ్చని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో.. సామాన్య ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో తక్కువ ధరలకు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రయోజనం పొందాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. అటు ఇప్పటికే రైతు బజార్లలో కిలో రూ.25కే ప్రభుత్వం ఉల్లిపాయలు అందిస్తోంది. ఆధార్ కార్డు చూపించడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇప్పుడు అదే తరహాలోనే బియ్యంపై రాయితీ అందిస్తున్నారు.

Follow Us