Andhra Pradesh: బార్ లైసెన్స్ ల ప్రక్రియ స్టార్ట్.. అప్లికేషన్ ఫీజు భారీగా పెంపు.. జోన్ల వారీగా దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బార్ లైసెన్సుల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు జోన్ల వారీగా బార్ లైసెన్సులకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో జరగనుంది.....
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) బార్ లైసెన్సుల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు జోన్ల వారీగా బార్ లైసెన్సులకు అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ప్రాసెస్ ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈనెల 28 వరకు నాన్-రిఫండబుల్ కింద అప్లికేషన్ (Application) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 28, 29 తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి, జోన్-1 అండ్ జోన్-4కు ఈనెల 30న బిడ్డింగ్ నిర్వహిస్తారు. జోన్-1లో శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలు ఉండగా, జోన్-4లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలు ఉన్నాయి. ఇక, జోన్-2 అండ్ జోన్-3కి ఈనెల 31న బిడ్డింగ్ జరుగుతుంది. జోన్-2లో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదారి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా ఉండగా…. జోన్-3లో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.
శుక్రవారం నుంచి అప్లికేషన్స్, ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలై ఈనెల 28తో ముగుస్తుంది. అప్లికేషన్స్ స్క్రూటినీ తర్వాత ఈనెల 30, 31 లేదీల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. న్యూ బార్ పాలసీ ప్రకారం మూడేళ్లపాటు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త పాలసీ అమలు కానుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి