Palnadu District: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకేసారి పవర్ కట్.. ఎందుకో తెలిస్తే విస్తుపోతారు
పల్నాడు జిల్లాలో ప్రభుత్వాఫీసులకు పవర్ షాక్ తగిలింది. ఎప్పుడూ సామాన్యులకు మాత్రమే ఇచ్చే విద్యుత్‌శాఖ, ఈసారి గవర్నమెంటోళ్లకు పట్టపగలే చుక్కలు చూపించింది.
AP News: పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఆఫీసులకు ఊహించని షాకిచ్చింది విద్యుత్ శాఖ. బిల్లులు చెల్లించలేదంటూ ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్ చేసింది. దాచేపల్లి(Dachepalle) నగర పంచాయతీ పరిధిలో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫీజులు తీసుకెళ్లిపోయారు విద్యుత్‌శాఖ అధికారులు. దాంతో, ప్రభుత్వ కార్యాలయాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్, ఎంపీడీవో, ఎమ్మార్వో, రైతు భరోసా, హెల్త్ సెంటర్స్, అంగన్ వాడీ సెంటర్, మోడల్ స్కూల్స్, వాటర్ గ్రిడ్స్…. ఇలా, అన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్ చేశామంటున్నారు విద్యుత్ సిబ్బంది. ఒక్క దాచేపల్లి పరిధిలోనే సుమారు 17కోట్ల రూపాయల పవర్ బిల్స్ పెండింగ్ ఉన్నాయంటున్నారు విద్యుత్ అధికారులు. ఆ పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తేనే రీకనెక్షన్ ఇస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల పెండింగ్ పవర్ బిల్లులు భారీగా పేరుకుపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు చాలా సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ రెస్పాన్స్ లేకపోవడంతో.. ఈ తరహా యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. ఇక పవర్ లేకపోవడంతో ఆఫీసుల్లో అన్ని పనులకు అటు సిబ్బంది, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆ పెండింగ్ బిల్లులను సర్కారీ సార్లు కడతారో లేదో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..