AP Teachers: టీచర్స్ డే వేడుకలకు ఉపాధ్యాయులు దూరంగా ఉండాలి.. ఏపీటీఎఫ్, యూటీఎఫ్ కీలక నిర్ణయం
AP Teachers: ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలకు ఉపాధ్యాయులు దూరంగా ఉండాలని..

AP Teachers: ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ డే వేడుకలకు ఉపాధ్యాయులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు సీపీఎస్ ఉపాధ్యాయులు. ఈ మేరకు ఏపీటీఎఫ్, యూటీఎఫ్‌తో పాటు మరికొన్ని అనుబంధ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. గత రెండు సంవత్సరాలుగా టీచర్లను ప్రభుత్వం వేధిస్తుందని అన్నారు. పారా పోలీస్ డ్యూటీలు, వైన్ షాపుల దగ్గర కాపలా, పిల్లలు లేకపోయినా స్కూల్ కి రావాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తు చేశారు. అలాగే సెప్టెంబర్ ఒకటి పిలుపు నేపథ్యంలో టీచర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, నిర్బంధించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని అవమానాలకు గురిచేసిన ప్రభుత్వం సన్మానాలు, సత్కారాలు చేస్తానంటే ఎలా స్వీకరిస్తామని ప్రశ్నిస్తున్నారు.
ఇక ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి బోత్స సత్యనారాయణ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులు పునరంకితం కావాలన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా.. ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







