డిజిటల్ విధానంలో టీచింగ్ ను స్టూడెంట్స్ కు మరింత చేరువ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తోంది. అయితే ట్యాబ్ ల పై పలు వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ట్యాబ్ లు క్వాలిటీ గా లేవని, ఈ విధానం ద్వారా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, బయటి మార్కెట్లతో పోలిస్తే.. గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో వాటన్నింటినీ చెక్ పెడుతూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ లో రూ.11,999/- ఉన్న ట్యాబ్ ను రూ.9,800కే కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. అంతే కాకుండా ట్యాబ్ ధర నుంచి అందులో ఉండే కంటెంట్, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చులు, మండల ఆఫీస్ లకు వాటిని చేర్చేంత వరకు అన్నింటినీ బేరీజు వేసుకున్నామని చెప్పింది. దీంతో రూ.221కోట్లు ఆదా చేసినట్లు వివరించింది.
సాధారణంగా అందరూ ఉపయోగించే 8 ఇంచుల ట్యాబ్ లతో పోలిస్తే ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్ లు 8.7 ఇంచెస్ ఉన్నట్లు వెల్లడించింది. ట్యాబ్ ల పంపిణీ కోసం వేసిన టెండర్ల ప్రక్రియలో నాలుగు కంపెనీలు పాల్గొనగా.. ప్రభుత్వం ఈ ప్రక్రియలో రూ.187కోట్లు ఆదా చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇది సాధారణం కంటే.. 22శాతం తక్కువ అని తెలిపింది. కాబట్టి ట్యాబ్ ల పంపిణీపై వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, ప్రభుత్వం ఏమి చేసినా ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తోందని స్పష్టం చేసింది.
కార్పొరేట్ విద్యను విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు, 59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్ ట్యాబ్‌లు ఉచితంగా అందించనున్నారు.
Claim: The Tab given to 8th Class students is costing Rs.11,999/- on Amazon, therefore, causing a loss of Rs.221 Cr.
Fact: Department of School Education and APTS saved total Rs.187 Crores of Government of AP. 1/5 pic.twitter.com/dlphs6l5J2
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) December 22, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..