Nagarjuna Sagar: నాగార్జున సాగర్ డ్యాంపై ప్రమాదం.. గేట్ ఆపరేట్ చేస్తున్న సమయంలో ఘటన
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ డ్యామ్‌పై ప్రమాదం జరిగింది. సాగర్ 26 వ క్రస్ట్‌గేట్ ఆపరేట్ చేస్తున్న సమయంలో ఫ్యాన్...
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ డ్యామ్‌పై ప్రమాదం జరిగింది. సాగర్ 26 వ క్రస్ట్‌గేట్ ఆపరేట్ చేస్తున్న సమయంలో ఫ్యాన్ విరిగింది. ఈ ఘటనలో గేట్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా.. సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3.42లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.20 అడుగుల వద్ద ఉంది. నీటి ప్రవాహం ఆధారంగా గేట్ల ఎత్తు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నాగార్జున సాగర్ 24 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా వస్తున్నారు. వరస సెలవు దినాల సందర్భంగా సందర్శకులు విపరీతంగా వస్తున్నారు. లాంచీ స్టేషన్ వద్ద విజిటర్ల తాకిడి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..