Badvel By Election: చింతల చెరువులో స్వల్ప ఉద్రిక్తత.. బీజేపీ ఏజంట్లను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..

బద్వేల్ నియోజకవర్గంలోని చింతల చెరువులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఏజంట్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది...

Badvel By Election: చింతల చెరువులో స్వల్ప ఉద్రిక్తత.. బీజేపీ ఏజంట్లను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..
Cheruv

Updated on: Oct 30, 2021 | 8:59 AM

బద్వేల్ నియోజకవర్గంలోని చింతల చెరువులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఏజంట్లను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోరుమామిళ్ల రంగసముద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు 77A బూత్‎లో 20 నిమిషాలు ఆలస్యంగా ఓటర్లను అనుమతించారు. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 221 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ ఉపఎన్నిక పోలింగ్‎కు 3000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది.

బద్వేల్‌ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి పనతల సురేశ్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాయి. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Read Also..  Badvel By Election: పోరుమామిళ్ల రంగసముద్రంలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ..