Ramakuppam Tension: చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. విగ్రహాల ఏర్పాటు వ్యవహారం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైంది. గత నెల 22వ తేదీన తొలగించిన అంబేద్కర్ స్థూపం వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించడంతో రామకుప్పంలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. అయితే, ఎస్సీ సంఘాలు మరో వర్గం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రామకుప్పంలో సమావేశమైన రెడ్డి సంఘం ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం చోటనే ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటుకు దిమ్మె నిర్మించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, ఎస్సీలు వారిని అడ్డుకున్నారు. దాంతో ఎస్సీలకు, రెడ్డి సంఘం ప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. స్థానికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒక వర్గానికి చెందిన జేసీబీ పై రాళ్ళ దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. చిత్తూరుు అడిషనల్ ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులు రామకుప్పంలో మోహరించారు. విగ్రహాల ఏర్పాటు ప్రాంతంలో ఘర్షణ వాతావరణాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణల నేపథ్యంలో అక్కడ పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు.
Also read:
Omicron: హోమ్ టెస్ట్ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Tea: చాయ్‌లో పాలు ఎందుకు కలుపుతారో తెలుసా.. దీని వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది.. అదేంటో తెలుసా..