అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ప్రకటించనుంది హైకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోట ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బయలు పిటిషన్‌ను విచారించారు జస్టిస్ లక్ష్మణ్. అవినాష్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. సునీత తరఫున సీనియర్ కౌన్సిల్ రవిచంద్ర, సీబీఐ తరఫున అనిల్ తల్వార్ తమ వాదనలు వినిపించారు. మూడు రోజులు పాటు వాదనలు విన్న హైకోర్టు బుధవారం ఉదయం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తీర్పు ఇవ్వనుంది.
అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి దృశ్య బుధవారం వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వెళ్లడయ్యే ముందు పలువురు సాక్ష్యుల స్టేట్మెంట్స్ పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని గత వాదనలో సిబిఐ పేర్కొన్నది. పలువురు సాక్ష్యులకు సంబంధించిన స్టేట్మెంట్స్‌ను షిల్డ్ కవర్లో ఇస్తామని ఇప్పటికే సిబిఐ హైకోర్టుకు తెలిపింది.
మరోవైపు తన తల్లిని హైదరాబాద్ ఏ ఐ జి హాస్పిటల్ కు తరలించినప్పటి నుండి హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఆవినష్ రెడ్డి. ఇక కోర్టు తీర్పు నేపథ్యంలో సిబిఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..