
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. ద్రోణి ప్రబావంతో వాతావరణం మారుతుందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్ర ప్రకారం.. నిన్నటి ద్రోణి తమిళనాడు నుండి మరఠ్వాడా వరకు కర్ణాటక – రాయలసీమ ప్రాంతాల అంతరముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ/ నైరుతి గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురసే అవకాశముంది.
సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.
గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, యానములో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీచుచున్నవి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..