Andhra Pradesh: ఉపాధ్యాయుడి కీచక పర్వం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. మూడోసారి సస్పెన్షన్..

|

Oct 29, 2022 | 12:49 PM

విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. రెండు సార్లు సస్పెండ్ అయినా..

Andhra Pradesh: ఉపాధ్యాయుడి కీచక పర్వం.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. మూడోసారి సస్పెన్షన్..
Student Harassment
Follow us on

విద్యార్థులకు దిశానిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యాయుడు వృత్తికే మాయని మచ్చలా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పించి, సమాజంలో మంచి పౌరుడిగా తీర్చి దిద్దాల్సిన టీచర్.. కీచకుడిగా వ్యవహరించాడు. రెండు సార్లు సస్పెండ్ అయినా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోలేదు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట బలుసుపాడు జడ్పీ హైస్కూల్ లో రాము అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్కూల్ లో చదువుతున్న విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినులతో అసభ్యకరంగా మాట్లాడుతూ వెకిలిచేష్టలు, డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతూ వేధించేవాడు. అంతటితో ఆగకుండా తగలరాని చోట తాకుతూ వాంఛను తీర్చుకునే యత్నం చేసేవాడు. ఇక భరించలేక స్టూడెంట్స్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. అయితే గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించి రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. మరోసారి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మూడోసారి సస్పెండ్ అయ్యాడు. ఇంకో విషయం ఏమిటంటే.. ఉపాధ్యాయుల కొరత కారణంగా బలుసుపడు పాఠశాలలకు రాము డిప్యుటేషన్ పై రావడం గమనార్హం.

విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చినప్పుడే కేవలం సస్పెన్షన్‌లు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. అలా కాక కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలా చేయడానికి భయపడతారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..