Guntur Mayor: గుంటూరు మేయర్‌ పీఠంపై టీడీపీ గురి.. ముహూర్తం ఎప్పుడో మరి..!

తెలుగుదేశం పార్టీ కన్ను గుంటూరు కార్పోరేషన్ పై పడింది. మరో ఏడాదిన్నర ఆగడం కంటే ఇప్పుడే మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిచింది. అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి వైసిపి మేయర్ ను దించే యత్నాలు చురుగ్గా సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. టిడిపి ప్రయత్నాలను ఏ మేరకు వైసిపి అడ్డుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Guntur Mayor: గుంటూరు మేయర్‌ పీఠంపై టీడీపీ గురి.. ముహూర్తం ఎప్పుడో మరి..!
Guntur Municipal Corporation
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 14, 2024 | 6:11 PM

తెలుగుదేశం పార్టీ కన్ను గుంటూరు కార్పోరేషన్ పై పడింది. మరో ఏడాదిన్నర ఆగడం కంటే ఇప్పుడే మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిచింది. అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చి వైసిపి మేయర్ ను దించే యత్నాలు చురుగ్గా సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. టిడిపి ప్రయత్నాలను ఏ మేరకు వైసిపి అడ్డుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

ఆట మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బతీసిన టీడీపీ.. స్థానిక సంస్థల్లోనూ జెండా ఎగరేయాలనుకుంటోంది. కీలకమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గురిపెట్టింది. విపక్షకూటమి క్లీన్‌స్వీప్‌ చేసిన గుంటూరు జిల్లాలో మరింత పట్టుబిగించేలా పావులు కదుపుతోంది అధికారపార్టీ. కీలకమైన గుంటూరు కార్పొరేషన్‌పై ఆ పార్టీ గురిపెట్టింది. గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. మొత్తం 58 మంది కార్పొరేటర్లలో 47మంది వైసీపీవారే. తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు రెండు డిప్యూటీ మేయర్ పదవులను మూడేళ్లక్రితం గెలుచుకుంది వైసీపీ. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మేయర్‌ని గద్దె దించే ప్రయత్నాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.

గుంటూరు మేయర్‌గా వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. కావటిపై సొంతపార్టీలోనే అసంతృప్తి ఉంది. మేయర్‌కి మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట అభ్యర్ధిగా వైసీపీ అధిష్ఠానం అవకాశమిచ్చింది. అయితే మనోహర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. వైసీపీ అధికారానికి దూరం కావటంతో పార్టీ కార్పొరేటర్లపై కావటి మనోహర్‌కి పట్టు తగ్గింది. ఎన్నికలకు ముందే ఎనిమిదిమంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో డిప్యూటీ మేయర్ సజీలా కూడా ఉన్నారు. ప్రస్తుతం జనసేనతో కలుపుకొని కార్పొరేషన్‌లో టీడీపీ బలం పందొమ్మిదికి చేరింది. మరో పదిమంది కార్పొరేటర్ల మద్దతు సాధిస్తే టీడీపీకే మేయర్ పీఠం దక్కుతుంది. ఆ టార్గెట్‌తోనే టీడీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు.

గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌పై తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు మొదట్నించీ అసంతృప్తిగానే ఉన్నారు. మేయర్‌కి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి ఏమాత్రం పడటం లేదు. దీంతో ముస్తఫా అనుచరులైన కార్పొరేటర్లు కావటికి మద్దతిచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో పెద్దగా కష్టపడాల్సిన పన్లేకుండానే టీడీపీ గుంటూరు మేయర్ పదవి దక్కించుకుంటుందన్న వాదన వినిపిస్తోంది. ముస్తఫా కూతురు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఇన్నాళ్లూ వెంటనడిచిన కార్పొరేట్లరు మాజీ ఎమ్మెల్యే మాట వినే పరిస్థితి ఉండదని టీడీపీ భావిస్తోంది. దీంతో పదిమంది కార్పొరేటర్లను తమవైపు తిప్పుకుని అవిశ్వాస తీర్మానం పెట్టాలని కార్పొరేషన్ పరిధిలోని సీనియర్ నేతలు ఆలోచన చేస్తున్నారట.

టీడీపీ నేత కోవెలమూడి నాని మేయర్ పదవిపై కన్నేసినట్లు చర్చ జరుగుతోంది. అమరావతి రాజధాని పనులు స్పీడప్‌ కావటంతో.. గుంటూరు నగరంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయని భావిస్తున్నారు. మేయర్‌గా అధికారపార్టీ పార్టీ నాయకుడు ఉంటేనే అనుకున్న అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారట. దీంతో అందరూ కలిసి అవిశ్వాస అస్త్రానికి పదునుపెట్టే పనిలో ఉన్నారు. ఈనెలాఖరుకి లేదంటే వచ్చే నెల మొదట్లో కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈలోపే కార్పొరేటర్లతో మంతనాలు జరిపి తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు అధికారపార్టీ ముఖ్య నేతలు. చూస్తుంటే కావటికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయినట్లే కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

దేశం మొత్తం మనవైపే చూస్తుంది.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
దేశం మొత్తం మనవైపే చూస్తుంది.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఒకప్పుడు సీరియల్ కిస్సర్.. ఒక్క సినిమాతో కెరీర్ రిస్క్..
ఒకప్పుడు సీరియల్ కిస్సర్.. ఒక్క సినిమాతో కెరీర్ రిస్క్..
సేవింగ్స్ ఖాతాలపైనా నిఘా! పరిమితికి మించితే అంతే సంగతులు..
సేవింగ్స్ ఖాతాలపైనా నిఘా! పరిమితికి మించితే అంతే సంగతులు..
లండన్‌లో కింగ్ కోహ్లీ- అనుష్క.. కృష్ణదాస్ కీర్తనలు వింటూ.. వీడియో
లండన్‌లో కింగ్ కోహ్లీ- అనుష్క.. కృష్ణదాస్ కీర్తనలు వింటూ.. వీడియో
స్కామ్‌ గురూ.. రూ. 200 పంపి.. రూ. 20,000 లాగేస్తారు.. జాగ్రత్త!
స్కామ్‌ గురూ.. రూ. 200 పంపి.. రూ. 20,000 లాగేస్తారు.. జాగ్రత్త!
అలాంటి పెళ్లిల్లకు మాత్రమే వెళ్తాను.. తాప్సీ..
అలాంటి పెళ్లిల్లకు మాత్రమే వెళ్తాను.. తాప్సీ..
భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఎవరో తెలుసా.?
భారతీయుడులో ముసలి కమల్ హాసన్ భార్య ఎవరో తెలుసా.?
భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? 4 రోజుల ప్రయాణం
భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఏదో తెలుసా? 4 రోజుల ప్రయాణం
అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ కూతురు సితార.. సినీ స్టార్లతో ఫొటోలు
అనంత్ అంబానీ పెళ్లిలో మహేశ్ కూతురు సితార.. సినీ స్టార్లతో ఫొటోలు
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్
మానవాళిని భయపెడుతోన్న మరో వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..