AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: “పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలయ్యారు”.. సీఎం జగన్ కు లోకేశ్ లేఖ

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలతో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని లేఖలో...

Andhra Pradesh: పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలయ్యారు.. సీఎం జగన్ కు లోకేశ్ లేఖ
Lokesh
Ganesh Mudavath
|

Updated on: May 05, 2022 | 8:14 AM

Share

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీలతో విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని లేఖలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షల(Tenth Exams) నిర్వహ‌ణలో పూర్తి విఫలమయ్యారని ఆరోపించారు. పీఆర్సీ, సీపీఎస్ ర‌ద్దు కోసం నిర‌స‌న చేపట్టిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష పెట్టుకుని వేధిస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచ‌ర్లుకు టెన్త్ ఫ‌లితాల టార్గెట్లు పెట్టారని, పేప‌ర్‌ లీక్ ల‌కు వారిని బాధ్యుల్ని చేస్తూ స‌స్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యంపై ప్రభుత్వం స్పంద‌న చాలా హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల స్వార్థంతో టెన్త్ ప‌రీక్షల నిర్వహ‌ణ అభాసుపాలై 6.22 లక్షల మంది విద్యార్థుల భ‌విష్యత్ అయోమయంగా మారిందని ఆవేదన చెందారు.

జగన్ సీఎం పదవి స్వీకరించి మూడేళ్లయినా క‌రోనా కార‌ణంగా రెండేళ్లు ప‌రీక్షలు జ‌ర‌గలేదు. ఎట్టకేల‌కు పాల‌నా యంత్రాంగం నిర్వహించిన ప‌రీక్షలు మ‌న దేశంలోని ప‌రీక్షల చ‌రిత్రలోనే చీక‌టి అధ్యాయంగా నిలిచాయి. రోజుకొక చోట పేప‌ర్ లీక్‌, మాస్ కాపీయింగ్‌, ఒక‌రి బ‌దులు మరొకర ప‌రీక్షలు రాయడం, లీకైన ప్రశ్న ప‌త్రాల‌కు జ‌వాబులు రాయించి జ‌త‌ చేయ‌డం వంటివ‌న్నీ జ‌రిగాయి. ప్రతిభ‌కు కొల‌మానంగా నిల‌వాల్సిన ప‌రీక్షలు అక్రమాల విక్రమార్కులకి వ‌రం అయ్యాయి. చాలా చోట్ల పేప‌ర్ లీకై, వైసీపీ వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం అవడం వైసీపీ నాయ‌కుల పిల్లల‌కు మెరుగైన మార్కుల కోసం చేశారన్న విషయం అర్థమవుతోంది.

             – లేఖలో నారా లోకేశ్ వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్ లు, మాస్ కాపీయింగ్ విప‌రీతంగా జ‌ర‌గ‌డం వంటివి క‌ష్టప‌డి చ‌దివిన విద్యార్థుల పాలిట శాపంగా మార‌ుతోంది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా కనీసం పేపర్ లీక్ ఘటనల పై సమీక్ష జరపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కి అద్దం పడుతోంది. టెన్త్ ప‌రీక్షల నిర్వహ‌ణ‌లో ఎదురైన వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఇంటర్ పరీక్షలనైనా సక్రమంగా నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Hyderabad: ఆలస్యంగా నడుస్తున్న ఉద్యోగుల రైలు.. నరకప్రాయంగా మారుతున్న ప్రయాణం

IPL 2022: మైదానంలో ప్రేమకథ.. ఆర్సీబీ అభిమానికి ప్రపోజ్‌ చేసిన అమ్మాయి..!

UNO AWARD to AP: రైతు భరోసా కేంద్రాలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. ఆర్బీకేలను వరించిన ఛాంపియన్‌ అవార్డు