TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..

TDP vs YCP: టీడీపీ నేత పట్టాభి రామ్ ని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడి చేసిన

TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..
Lokesh
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 20, 2021 | 10:51 PM

TDP vs YCP: టీడీపీ నేత పట్టాభి రామ్ ని అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని రక్షించే పోలీసులైతే పట్టాభిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి కానీ, దాడికి గురైన పట్టాభినే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ అరెస్ట్‌ గమనిస్తే.. వీరు ప్రజల కోసం పని చేసే పోలీసులు కాదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. పట్టాభికి హానీ తలపెట్టాలని పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. పట్టాభికి ఏమైనా జరిగితే డీజీపీ, ముఖ్యమంత్రిదే బాధ్యత అని స్పష్టం చేశారు. తక్షణమే పట్టాభిని కోర్టు ముందు హాజరుపరుచాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ‘బోసిడీకే’ అనేది రాజద్రోహం అయితే.. వైసీపీ నేతల అసభ్య భాష ఏ ద్రోహం కిందకు వస్తుందో డీజీపీ సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ గుట్టురట్టు చేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే పట్టాభి రామ్‌ ని అదుపులోకి తీసుకున్నారని, ఈ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందని లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని దాడులు చేసినా.. ఎంతమందిని అరెస్ట్ చేసినా.. దేశానికే ముప్పుగా పరిణమించిన వైసీపీ డ్రగ్స్ మాఫియా ఆట కట్టించే వరకు టీడీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

తోట్లవల్లూరు పీఎస్‌కు పట్టాభి.. ఇదిలాఉంటే.. టీడీపీ నేత పట్టాభి రామ్‌ని తోట్లవల్లూరు తరలించారు పోలీసులు. భారీ భద్రత మధ్య తోట్లవల్లూరు పీఎస్‌కు తరలించారు. కాగా, ముఖ్యమంత్రిని పరుష వ్యాఖ్యలతో దూషించిన పట్టాభిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Taliban Rule: ఇదీ తాలిబన్ల రాక్షసత్వం.. వాలీబాల్ క్రీడాకారిణిని పొట్టనబెట్టుకున్నారు.. ఎందుకంటే..

Zodiac Signs: ఈ రాశుల వారిలో పోటీతత్వం ఎక్కువ.. ఎటువంటి పరిస్థితిలోనూ రాజీ పడరు.. ఆ రాశులేమిటంటే..

Vitamin A: విటమిన్‌ A కావాలంటే కచ్చితంగా ఈ 5 ఆహారాలు తినాల్సిందే..!