Andhra Pradesh: నివురుగప్పిన నిప్పులా మారిన పలాస.. లోకేశ్ పర్యటనలో క్షణక్షణం ఉత్కంఠ
ఉత్తరాంధ్ర సలసల ఉడుకుతోంది. ఇళ్లు కూల్చివేత ఇష్యూతో నివురుగప్పిన నిప్పులా తయారైంది. లోకేశ్ (Lokesh) టూర్‌తో తర్వాత పలాసలో సిట్యువేషన్ మరింత రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పలాస...

ఉత్తరాంధ్ర సలసల ఉడుకుతోంది. ఇళ్లు కూల్చివేత ఇష్యూతో నివురుగప్పిన నిప్పులా తయారైంది. లోకేశ్ (Lokesh) టూర్‌తో తర్వాత పలాసలో సిట్యువేషన్ మరింత రసవత్తరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా పలాస (Palasa) లో చెలరేగిన వివాదం చినికిచినికి గాలివానలా తయారవుతోంది. మూడు రోజుల క్రితం ఇళ్ల కూల్చివేతలతో మొదలైన వివాదం.. నిప్పులు కక్కుతోంది. పలాసకు వెళ్తున్న లోకేశ్‌ను అడ్డుకోవడంతో గొడవ పీక్స్ కు చేరింది. ఈ వివాదం చివరికి లోకేశ్ కు మంత్రి సీదిరి అప్పల్రాజు (Minister Seediri Appalraju) మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. పలాస ఇష్యూలో సీఎం జగన్‌పై నారా లోకేశ్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయన జగన్మోహన్‌రెడ్డి కాదు జేసీబీ మోహన్‌రెడ్డి అన్నారు. లోకేశ్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పల్రాజు. పలాసలో అయినా.. ఇంకెక్కడైనా ఆక్రమణలపైనే చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని, వాటన్నింటినీ బయటికి తీస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అప్పల్రాజు.
మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో పలాస వెళ్తున్న లోకేశ్ ను శ్రీకాకుళం నగరం సమీపంలోని హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తరోడ్డు కూడలి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. లోకేశ్ సహా మాజీ మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప, ఇతర నేతలు రోడ్డుపై నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది.
కాగా.. పలాసలో ఇళ్లు కూల్చివేత ఇష్యూ ఉత్తరాంధ్రలో హైటెన్షన్ పుట్టిస్తోంది. లోకేశ్ టూర్‌తో అది పీక్స్‌కి చేరింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా? లేక మరింత పీక్స్‌కి వెళ్తుందా? అనేది వేచి చూడాలి.




మరిన్ని ఏపీ వార్తల కోసం