
TDP Leader Devineni Uma Maheswara Rao : ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలకు సమాయత్తమైన ప్రధాన పార్టీలు.. మాటల తూటాలతో దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ దేవినేని ఉమ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలో “తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కు గ్యారంటీ” బస్సు యాత్రలో పాల్గొన్న దేవినేని ఉమా ఈ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. టీడీపీ చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా దేవినేని ఉమామమేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను ఎప్పుడైనా తుదముట్టించవచ్చు’’.. అంటూ పేర్కొన్నారు. కొండపల్లిలో నా కారుపై బండరాయితో దాడి చేశారు.. కారుడోర్ తీసి ఉంటే నాతో పాటు మరికొందరు చనిపోయేవారు.. పడవ మునిగినప్పుడు గోదారితల్లి నన్ను బతికించింది.. అంటూ బస్సుయాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొ్న్నారు.
ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తన జీవిత ఆశయం ఒక్కటేనని.. చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానంటూ హామీనిచ్చారు. చింతలపూడి ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..