TDP: చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు.. ముహూర్తం ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‎లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ - 135 , జనసేన - 21, బీజేపీ - 8 మొత్తం 164 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

TDP: చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు.. ముహూర్తం ఎప్పుడంటే..
Chandrababu Naidu
Follow us

|

Updated on: Jun 09, 2024 | 7:58 AM

ఆంధ్రప్రదేశ్‎లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ – 135 , జనసేన – 21, బీజేపీ – 8 మొత్తం 164 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే నాలుగు సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవానికి ఈ ఐదేళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు నారా చంద్రబాబునాయుడు. అయితే ముందుగానే ప్రమాణస్వీకారానికి రెండు తేదీల్లో మంచి ముహూర్తాలు చూసిన పండితులు.. ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రమాణస్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..