Andhra Pradesh: లోకేశ్ ను చూసి వైసీపీ భయపడుతోంది – అందుకే టార్గెట్ చేస్తున్నారు.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్
టీడీపీ లీడర్ నారా లోకేశ్ (Nara Lokesh) కు కేంద్రప్రభుత్వం జెడ్ భద్రత ఇవ్వాలని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న...
టీడీపీ లీడర్ నారా లోకేశ్ (Nara Lokesh) కు కేంద్రప్రభుత్వం జెడ్ భద్రత ఇవ్వాలని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతో లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అక్రమంగా దూరారని మండిపడ్డారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లోకేశ్ ను బెదిరంచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లోకేశ్ ను చూసి వైసీపీ(YCP) భయపడుతోందన్న బుద్దా.. అందుకే లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 15న చోడవరంలో మినీ మహానాడు జరుగుతుందని చెప్పారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షత వహిస్తారని వెల్లడించారు. అంతే కాకుండా ఈ నెల 18 న చీపురుపల్లిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి అయిన గంగాధర్ రెడ్డి మరణం పై సీబీఐ విచారణ జరపాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీను తో పాటు నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారో ఇప్పుడు కూడా అలానే జరుగుతోందని అన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న చాలా మంది ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఆవేదన చెందారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త ప్రాణాలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. వివేకాను హత్య చేసినవవాళ్లే ఈ చర్యలకు పాల్పడుతున్నారని బుద్దా వెంకన్న తీవ్రంగా విమర్శించారు.
టెన్త్ విద్యార్థులతో నారా లోకేష్ జూమ్ మీటింగ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వీడియోలు కట్ చేయడం, వైసీపీ నేతలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జూమ్ మీటింగ్‌కు రాజకీయ రంగు అంటుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి