Pawan Kalyan-Lokesh: జనసేన, టీడీపీ టార్గెట్ అదే.. తొలి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన పవన్, లోకేష్..
జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్, నారా లోకేష్ హాజరయ్యారు. పవన్, లోకేష్ అధ్యక్షతన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో జరిగే ఈ సమావేశంలో ఇరు పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికలే టార్గెట్ గా ఇరు పార్టీలు భవిష్యత్ కార్యక్రమాలపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నాయి.

జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్, నారా లోకేష్ హాజరయ్యారు. పవన్, లోకేష్ అధ్యక్షతన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో జరిగే ఈ సమావేశంలో ఇరు పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికలే టార్గెట్ గా ఇరు పార్టీలు భవిష్యత్ కార్యక్రమాలపై ఉమ్మడి కార్యాచరణను రూపొందించనున్నాయి. ఇప్పటికే రెండు పార్టీల నుంచి కమిటీల నియామకం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మీటింగ్ తర్వాత పవన్‌కల్యాణ్ మాట్లాడడనున్నారు. ఈ భేటీకి ఇరుపార్టీల నుంచి 14మంది హాజరవుతారని.. ఆయా పార్టీల నేతలు తెలిపారు. విడివిడిగా కార్యక్రమాలు, ఉమ్మడిగా పోరాటాలు.. ప్రతీ కార్యక్రమానికి ఇరు పార్టీల కేడర్ హాజరయ్యేలా వ్యూహం.. సీట్లు, ఓట్లు పక్కనబెట్టి పోరాటంపై దృష్టి సారించడం, వైసీపీని గద్దెదించే లక్ష్యంగా ఉమ్మడి కార్యక్రమాలు.. వారాహి, లోకేష్, భువనేశ్వరి యాత్రలపై చర్చ, పవన్ వారాహి యాత్ర, లోకేష్ భవిష్యత్‌కు గ్యారెంటీ యాత్ర.. తదితర కార్యాచరణను రూపొందించనున్నారు. చంద్రబాబు అరెస్టు అనంతరం.. పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశంలో టికెట్ల అంశాన్ని కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ రోజు నారా లోకేష్ చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ముఖ్యంగా ఈ సమన్వయ కమిటీ మీటింగ్ గురించే చర్చించినట్లు తెలుస్తోంది. మీటింగ్ అనంతరం.. పవన్ కల్యాణ్ మీడియాతో ఏం మాట్లాడతారనేది.. చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనే నేతలు వీరే..
జనసేన నుంచి.. పవన్ కళ్యాణ్, వి మహేందర్ రెడ్డి, కోటికలపుడి గోవిందరావు కందుల దుర్గేష్, నాదెళ్ల మనోహర్, బొమ్మిడి నాయకర్, పలవలసాల యశస్వినీ..
టీడీపీ నుంచి.. నారా లోకేష్, తంగిరాల స్వామ్య, నిమ్మల రామానాయుడు, కింజరాపు అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ..
జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశంలో భాగంగా మొదటగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హోటల్ కు చేరుకున్నారు. అయితే, లోకేష్ తోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా హోటల్ కు చేరుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
