Watch Video: నారా భువనేశ్వరి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు.. అక్కడి నుంచి యాత్రకు శ్రీకారం
చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై నెలన్నర రోజులు అయిన నేపథ్యంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లి నుంచి ఆమె తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు.
చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారయ్యింది. తిరుపతి జిల్లాలో మూడ్రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. మంగళవారం ఉదయం ఆమె శ్రీవారిని దర్శించుకోనున్నారు. మంగళవారం తిరుపతిలోనే నారా భువనేశ్వరి బస చేస్తారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లికి చేరుకుని.. అక్కడి నుంచి నిజం గెలవాలిపేరిట టీడీపీ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజున రాత్రి నారావారి పల్లిలోనే బస చేస్తారని మాజీ మంత్రి, టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుందని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారని తెలిపారు.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

