AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముదురుతోన్న టీడీపీ-వైసీపీల మధ్య ప్రచార’పోరు’

ఎన్నికల వేళ టీడీపీ-వైసీపీ మధ్య ప్రచారపోరు తారాస్థాయికి చేరుతోంది. పట్టున్న ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలను తమ ప్రాంతాల్లోకి రానీయకుండా.. ఇరు పార్టీలు తమ బలగాలతో మోహరించాయి. మొన్న కడప జిల్లాలో టీడీపీ నేతలను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ బాహాబాహీకి దిగాయి. దీంతో.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా.. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. […]

ముదురుతోన్న టీడీపీ-వైసీపీల మధ్య ప్రచార'పోరు'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 3:26 PM

Share

ఎన్నికల వేళ టీడీపీ-వైసీపీ మధ్య ప్రచారపోరు తారాస్థాయికి చేరుతోంది. పట్టున్న ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలను తమ ప్రాంతాల్లోకి రానీయకుండా.. ఇరు పార్టీలు తమ బలగాలతో మోహరించాయి. మొన్న కడప జిల్లాలో టీడీపీ నేతలను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. తాజాగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ-టీడీపీ బాహాబాహీకి దిగాయి. దీంతో.. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా.. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి ముంగిలిపట్టు గ్రామంలో ప్రచారం చేసేందుకు వచ్చారు. అయితే.. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు చెవిరెడ్డి టీమ్‌ను రానీయకుండా అడ్డుపడ్డారు. చెవిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తమ వారికి మద్దతుగా అక్కడికి రావడంతో గొడవ ముదిరింది.

ఇరు వర్గాల మధ్య మాటలు హద్దు దాటి.. పరిస్థితి చేయిదాటేలా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు పార్టీల నేతలను శాంతిపజేసే ప్రయత్నం చేశారు. అయినా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉండడంతో.. చెవిరెడ్డిని స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు. ఇరు వర్గాలు శాంతిచాక చెవిరెడ్డిని వదిలిపెట్టారు.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు