ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. ఆ రెండు పార్టీలకే అవకాశం..

|

Jul 02, 2024 | 8:15 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. టీడీపీ నుంచి సీ రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా, జనసేన నుంచి హరిప్రసాద్‌ ఎంపికయ్యారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కారు. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యింది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని టీడీపీకి.. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది.

ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.. ఆ రెండు పార్టీలకే అవకాశం..
Ap Mlc
Follow us on

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. టీడీపీ నుంచి సీ రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా, జనసేన నుంచి హరిప్రసాద్‌ ఎంపికయ్యారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కారు. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యింది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని టీడీపీకి.. మరో స్థానాన్ని జనసేనకు కేటాయించింది. టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య పేరు ఖరారు కాగా.. మరోవైపు జనసేన పార్టీ నుంచి ఆపార్టీఅధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్‌ పేరు ఖరారు చేశారు. ఇవాళ వీళ్లిద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

వెనుకబడిన ప్రాంతంగా పిలువబడే రాయలసీమ నుంచి బలిజసామాజిక వర్గానికి చెందిన నేతగా, సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలంగా మంత్రిగా, ఎంపీగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ ఎమ్మెల్సీగా పని చేశాడు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 డిసెంబర్‎లో వైసీపీకి గుడ్ బై చెప్పి అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అనర్హత వేటు వేశారు శాసన మండలి చైర్మన్. ఈక్రమంలో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. జనసేన పార్టీ అభ్యర్థి పి. హరి ప్రసాద్ జర్నలిస్టుగా పని చేశారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జనసేన పార్టీ మీడియా హెడ్‌గా, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఇక అసెంబ్లీలో బలబలాలను పరిశీలిస్తే ఈ రెండు స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో పోటీలో ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే శాశనమండలిలో మెజార్టీ సీట్లు ఉన్న వైసీపీని ఎదుర్కోవడానికి ఎన్డీయే ప్రభుత్వానికి అదనంగా రెండు సీట్లతో బలం పెరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..