Ap Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన.. రాగల మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో..
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం...
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాగల మూడు రోజులకు సంబంధించి రాష్ట్ర వాతావరణ ముఖచిత్రం ఎలా ఉండబోతుందనే దానిపై వాతావరణ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ రోజు, రేపు ఉత్తరకోస్తా్ంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఉత్తరకోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక దక్షిణకోస్తాంధ్ర వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ రోజు, రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం నాడు దక్షిణకోస్తాంధ్రలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోనూ అదే పరిస్థితి ఉండనుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోసర్తు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Also read: