Andhra Pradesh: భార్యపై అనుమానంతో సైకోలా మారిన భర్త.. ఇద్దరు కూతుళ్లను దారుణంగా..

భార్యపై అనుమానం, కోపంతో కన్న బిడ్డలనే అతి దారుణంగా కడతేర్చాడు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Andhra Pradesh: భార్యపై అనుమానంతో సైకోలా మారిన భర్త.. ఇద్దరు కూతుళ్లను దారుణంగా..
Crime News

Updated on: Sep 20, 2022 | 7:21 PM

Andhra Pradesh:  గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం, కోపంతో తమ ఇద్దరు పిల్లలను కాల్వలో పడేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన తాడేపల్లి మండలంలో కలకలం రేపింది. భార్యపై అనుమానంతో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సైకోగా మారాడు. కన్న బిడ్డలనే అతి దారుణంగా కడతేర్చాడు. ఇద్దరు పిల్లలను కుంచనపల్లిలోని బకింగ్‌హామ్ కెనాల్‌లోకి తోసేశాడు. నిన్నటి నుంచి తన పిల్లలు జోష్న (6), షణ్ముఖ వర్మ (4) కనిపించడం పోవటంతో..ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. పిల్లలు అదృశ్యమైనట్టు పెద్దకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పిల్లలకోసం గాలింపుచేపట్టారు. పోలీసుల దర్యాప్తులో పిల్లలను తండ్రే చంపినట్లు తమ విచారణలో తేలింది. గజ ఈతగాళ్ల సాయంతో బకింగ్‌హామ్ కెనాల్‌లో వెతకగా.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించింది.. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి