పదో తరగతి(Tenth Exams) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ(Narayana) బెయిల్ పిటిషన్ విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుజాత హాజరు కాలేదు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సత్య ప్రభాకర్ రావు.. ఏపీపీ సుజాతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిశాంత్ రెడ్డి ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో సత్య ప్రభాకర్ రావు పేర్కొన్నారు. పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ ఘటనలో చిత్తూరు(Chittoor) టౌన్ పీఎస్ లో నారాయణపై కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణ ఏ9 గా ఉన్నారు. నారాయణకు మే 10న నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇన్చార్జ్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. నారాయణకు బెయిల్ మంజూరు కాకుండా జుడీషియల్ కస్టడీకి అప్పగించేలా మేజిస్ట్రేట్ ఎదుట కేసు తీవ్రతను వివరిస్తూ వాదనలు వినిపించాలని ఏపీపీ ని కోరారు. అయినా ఆమె హాజరు కాలేదని చిత్తూరు వన్ టౌన్ సీఐ అన్నారు. విధినిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించడంతో నారాయణకు బెయిల్ మంజూరైందని రిశాంత్ రెడ్డి నివేదికలో ఉందని.. ఈ మేరకు ఏపీపీ పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అనుమతి లేనిదే జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి నారాయణను ఈనెల 10న చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్‌లో నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలు ఏపీలో సంచలనం కలిగించాయి. ఇటీవల సీఎం జగన్ కూడా నారాయణ, చైతన్య సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్‌లో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలులో వాట్సప్ గ్రూపుల్లో ప్రశ్నా పత్రాలు బయటకు వచ్చాయి. ఈ కేసుకి సంబంధించి చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు నారాయణను తీసుకెళ్లారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
NTR 31: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్ వచ్చేసింది.. ఊరమాస్ లుక్‌లో అదరగొట్టిన తారక్..
Liposuction: కన్నడ నటి మృతికి కారణమిదే.. లైపోసెక్షన్ చికిత్సపై షాకింగ్ విషయాలు చెప్పిన నిపుణులు..