Obulapuram Mining Case: మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిందితులకు ఊహించని షాక్.. వాయిదాలకు నో పర్మిషన్..

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నిందితులకు ఊహించని షాకిచ్చింది. డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను త్వరగా ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విచారణలో జరుగుతోన్న జాప్యంపై..

Obulapuram Mining Case: మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిందితులకు ఊహించని షాక్.. వాయిదాలకు నో పర్మిషన్..
Supreme court
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 24, 2022 | 9:15 AM

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నిందితులకు ఊహించని షాకిచ్చింది. డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణను త్వరగా ముగించి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విచారణలో జరుగుతోన్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. నిందితులు కోరినా, ఎలాంటి వాయిదాలకు అనుమతించొద్దంటూ సీబీఐ స్పెషల్‌ కోర్టును ఆదేశించింది. అదే సమయంలో ట్రయల్‌ కోర్టు విచారణలో జాప్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణను ఆలస్యం చేసేందుకు నిందితులు అన్నిరకాల ప్రయత్నాలు చేసినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొంది. విచారణలో అసలెందుకు జాప్యం జరిగిందో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించింది. ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ రిపోర్ట్‌ ఇవ్వడంతో, దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. నిందితుల డిశ్చార్జ్‌ పిటిషన్లపై త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. అయితే, ఎలాంటి వాయిదాలకు ఛాన్సే ఇవ్వొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పడంతో కేసు అనూహ్య మలుపు తిరిగినట్టయ్యింది.

కాగా. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. మైనింగ్ ను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని కోరుతూ కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఓబుళాపురం మైనింగ్ లో లీజు ప్రాంతాన్ని దాటి జరిపారన్న ఆరోపణలపై పనులు నిలిపేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. మైనింగ్ ప్రాంతం కర్నాట, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటంతో బార్డర్స్ ను గుర్తించాలని సూచించింది. లీజు ప్రాంతాన్ని మార్కింగ్ చేసేంత వరకూ మైనింగ్ ను కొనసాగించవద్దని ఆదేశాలిచ్చింది. దీనిపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మైనింగ్ లీజు ప్రాంతాలను దాటి పనులు చేసినట్లు నిర్ధారించింది. దీంతో సెంట్రల్ ఎపంవర్డ్ కమిటీ మళ్లీ ప్రారంభించేలా సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణను త్వరగా ముగించాలని ఆదేశించింది. మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్ధన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు ఈ కేసులో నిందితులుగా ఉండటంతో సుప్రీం ఆదేశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దశాబ్దం క్రితం నమోదైన ఈ కేసులో త్వరగా విచారణ పూర్తి చేస్తే ఎలాంటి జడ్జిమెంట్‌ రాబోతుందోనన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం కోసం క్లిక్ చేయండి..