ఎండదెబ్బకు పాములు.. విలవిల..
ఎండదెబ్బకు జనాలే కాదు.. జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. ఎండవేడిమి తట్టుకోలేక పాములు పుట్టలు గుట్టలు వదిలి చల్లదనం కోసం జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. కింగ్ కోబ్రాలు, రక్త పింజరులు వంటి విషపూరిత సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతుండడంతో విశాఖ నగర వాసులు హడలెత్తుతున్నారు. అడవులు నరికివేయడంతో మూగ జీవాలకు నిలువ నీడ దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వన్య ప్రాణులు అరణ్యాలను వదిలి జనావాసాల బాట పడుతున్నాయి. విశాఖ నగరం చాలా వరకు కొండలు, గుట్టల మధ్యే విస్తరించి ఉంది. […]

ఎండదెబ్బకు జనాలే కాదు.. జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. ఎండవేడిమి తట్టుకోలేక పాములు పుట్టలు గుట్టలు వదిలి చల్లదనం కోసం జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. కింగ్ కోబ్రాలు, రక్త పింజరులు వంటి విషపూరిత సర్పాలు జనావాసాల్లోకి చొరబడుతుండడంతో విశాఖ నగర వాసులు హడలెత్తుతున్నారు.
అడవులు నరికివేయడంతో మూగ జీవాలకు నిలువ నీడ దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వన్య ప్రాణులు అరణ్యాలను వదిలి జనావాసాల బాట పడుతున్నాయి. విశాఖ నగరం చాలా వరకు కొండలు, గుట్టల మధ్యే విస్తరించి ఉంది. గాజువాక, బీసీ కాలనీ, తాటిచెట్ల పాలెం, మింది వంటి చాలా ప్రాంతాల్లో ఉన్న కొండలు కబ్జాదారుల పాలై జనావాసాలుగా మారిపోతున్నాయి. దీనికి తోడు నగరంలో గత మూడేళ్లుగా సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదవటంతో పచ్చదనం కరువైంది. దీంతో.. పలు రకాల జంతువులు జనావాసాల్లోకి వస్తోన్నాయి.