AP Corona Virus: మల్లన్న భక్తులకు అలెర్ట్.. చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచన..

|

Jan 08, 2022 | 8:18 PM

Srisailam- Corona Virus: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..

AP Corona Virus: మల్లన్న భక్తులకు అలెర్ట్.. చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవాలని సూచన..
Follow us on

AP Corona Virus: ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు ఒమిక్రాన్ కేసులు నమోదవుతూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు  మొదలు పెట్టింది. తాజాగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై ఆలయ ఈవో లవన్న దృష్టి పెట్టారు.  వివరాల్లోకి వెళ్తే..

శ్రీశైలంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై దేవస్థానం పరిపాలన భవనంలో ఈవో లవన్న ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో లవన్న మాట్లాడుతూ..  చంటిపిల్లల తల్లులు శ్రీశైల యాత్ర వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించినవారిని మాత్రమే స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తామని చెప్పారు. అంతేకాదు క్షేత్రపరిధిలో పలు చోట్ల శానిటైజేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రంలో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా అధికారులు దృష్టి సారించాలని ఈవో లవన్న సూచించారు.

Also Read:

కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సంప్రదాయం దుస్తుల్లో.. ప్రభల ఊరేగింపులో స్టూడెంట్స్…

ఆర్ధిక, మానసిక సమస్యల నివారణకు.. శనివారం శనీశ్వరుడికి ఈ నూనెతో పూజ చేయండి… అద్భుతం ఫలితం మీ సొంతం

ఈ రాశుల వారు పొదుపు చేయడంలో నిష్ణాతులు, వృధా ఖర్చులను ఇష్టపడరు..