AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Hundi Income: శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం.. కేవలం 33 రోజుల్లో…

కార్తీకమాసంలో శ్రీశైలం శివయ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బ్రమరాంబ అమ్మవారితో పాటు స్వామికి బంగారం, వెండి, నగదు రూపంలో కానుకలు సమర్పించారు. కొందరు భక్తులు విదేశీ కరెన్సీ సైతం హుండీలో వేశారు. ఫలితంగా గత ఏడాది కార్తీకమాసంతో పోలిస్తే.. ఈ ఏడాది హుండీ ఆదాయం విపరీతంగా పెరిగింది.

Srisailam Hundi Income: శ్రైశైల మల్లన్నకు కార్తీకమాసంలో కళ్లు చెదిరే ఆదాయం.. కేవలం 33 రోజుల్లో...
Srisailam
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 2:43 PM

Share

కార్తీక మాసం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగి, స్వామి–అమ్మవార్ల హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. తాజాగా చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన హుండీ లెక్కింపులో మొత్తం రూ. 7,27,26,400 ఆదాయం నమోదైంది. గత 33 రోజులలో భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన నగదు కానుక ఇంత మొత్తమని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కార్తీక మాసంతో పోలిస్తే ఈసారి సుమారు రూ.1,30,34,024 అధికంగా కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో వెల్లడించారు. భారతీయ నగదుతో పాటు భక్తులు అనేక విదేశీ కరెన్సీలను కూడా సమర్పించారు. USA డాలర్లు – 646, సౌదీ రియాల్స్ – 85, యూఏఈ దిర్హమ్స్ – 120, కత్తర్ రియల్స్ – 136, సింగపూర్ డాలర్లు – 30, ఇంగ్లాండ్ పౌండ్స్ – 85, ఆస్ట్రేలియా డాలర్లు – 25, ఒమన్ బైంసా – 200లను భక్తులు హుండీలో వేశారు.

ఇతర కానుకల్లో 117.800 గ్రాముల బంగారం, 7 కిలోలు 230 గ్రాముల వెండి కూడా ఉన్నాయి. ఇవన్నీ భక్తులు స్వామి–అమ్మవార్లకు పవిత్ర కానుకలుగా సమర్పించినవి. పటిష్ట నిఘా మధ్య, ఈవో శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో దేవస్థానం అధికారులు, ఉద్యోగులు, శివసేవకులు పాల్గొన్నారు. శ్రీశైలం క్షేత్రంపై భక్తుల నమ్మకం, భక్తిశ్రద్ధకు మరోసారి మల్లన్న హుండీ సాక్ష్యంగా నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us