ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంకు చెందిన పలాసలో ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ అండ్ డయాలిసిస్ యూనిట్.. తాత్కాలిక ప్రాతిపదికన 60 జూనియర్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలిసిస్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, సపోర్టింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 7వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి/బీఏ/ బీఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంఎస్‌డబ్ల్యూ/డీఎంఐటీ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మర్చి 31, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.32,670ల వరకు జీతంగా చెల్లిస్తారు.
Superintendent, GGH, Srikakulam, Andhra Pradesh.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.