Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానలొస్తున్నాయోచ్.. రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి తొంగిచూసేదెప్పుడంటే..

Monsoon: రేపో, మాపో తెలంగాణకు రాబోతున్నాయి రుతుపవనాలు. బీహార్‌,యూపీలో ఎండలు దంచికొడుతుండగా అసోం , రాజస్థాన్‌ , గుజరాత్‌ రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు యూపీ లోనే వందమంది ప్రాణాలు కోల్పోయారు.

వానలొస్తున్నాయోచ్.. రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి తొంగిచూసేదెప్పుడంటే..
Monsoon
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 19, 2023 | 9:39 PM

రాయలసీమను నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తాకాయి. దక్షిణాంద్ర లోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. మంగళవారం తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల జనం, రైతులు ఎప్పుడెప్పుడా అని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులతే వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని ఆకాశానికేసి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తియ్యని కబురు అందించింది. రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించాయి.

రేపో, మాపో తెలంగాణకు రాబోతున్నాయి రుతుపవనాలు. బీహార్‌,యూపీలో ఎండలు దంచికొడుతుండగా అసోం , రాజస్థాన్‌ , గుజరాత్‌ రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు యూపీ లోనే వందమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా లోనే వడగాల్పులకు 64 మంది చనిపోయారు. రాజస్థాన్‌ లోని పలు జిల్లాలు ఇప్పటికి వరద గుప్పిట్లో ఉన్నాయి. బర్మేర్‌తో పాటు అజ్మీర్‌లో కూడా వరదలు వణికించాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇళ్ల లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాజస్థాన్‌లో వరదలతో భారీ నష్టం జరిగింది. బర్మేర్‌, సిరోహి, జలోర్‌లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల కారణంగా ఐదుగురు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. అజ్మీర్‌ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలోకి వరద నీరు చేరి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరోవైపు చెన్నైలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. దీంతో రైల్వేశాఖ అప్రమత్తమయ్యింది. చెన్నై సెంట్రల్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. లోకల్ ట్రైన్ సేవలు పాక్షికంగా రద్దు చేశారు. చెన్నై కి బదులుగా ఆవడి , తిరువళ్లూరు, అరకోణం నుంచి రైళ్లను నడిపిస్తున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం