Andhra Pradesh: ఏపీ రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లలో మరో స్పెషల్ ట్రైన్ పొడిగింపు..
వేసవి సీజన్‌తో పాటు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను తెలుగు రాష్ట్రాల మధ్య నడుపుతోన్న..
వేసవి సీజన్‌తో పాటు ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను తెలుగు రాష్ట్రాల మధ్య నడుపుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, కర్నూలు రూట్ల మధ్య మరో స్పెషల్ ట్రైన్ సర్వీస్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
స్పెషల్ ట్రైన్(07067): మచిలీపట్నం టూ కర్నూలు సిటీ మధ్య పరుగులు పెట్టనున్న ఈ రైలు.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 29 వరకు శనివారం, మంగళవారం, గురువారం రోజుల్లో నడవనుంది. ప్రత్యేక రైలు(07068): కర్నూలు సిటీ టూ మచిలీపట్నం మధ్య నడవనున్న ఈ రైలు.. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆదివారం, బుధవారం, శుక్రవారం రోజుల్లో నడవనుంది.
కాగా, ఈ ప్రత్యేక రైళ్లు.. గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్ రైల్వే స్టేషన్లలో ఆగనుంది. కాగా, ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఈ రైళ్లు నడవనున్నాయి.