Andhra Pradesh: కుమారులే కాడెడ్లయ్యారు.. దుక్కి దున్నుతూ తండ్రికి బాసటగా నిలిచారు

|

Jul 27, 2022 | 5:28 PM

భారతదేశం వ్యవసాధారిత దేశం. చాలా కుటుంబాలు పంటలు పండిస్తూ (Andhra Pradesh) జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే దేశంలో పెద్ద రైతులతో పోలిస్తే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే ఎక్కువ. వారికి ఉన్న తక్కువ పొలంలోనే వ్యవసాయం...

Andhra Pradesh: కుమారులే కాడెడ్లయ్యారు.. దుక్కి దున్నుతూ తండ్రికి బాసటగా నిలిచారు
Sons Agriculture
Follow us on

భారతదేశం వ్యవసాధారిత దేశం. చాలా కుటుంబాలు పంటలు పండిస్తూ (Andhra Pradesh) జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే దేశంలో పెద్ద రైతులతో పోలిస్తే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే ఎక్కువ. వారికి ఉన్న తక్కువ పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబభారాన్ని మోస్తుంటారు. వీరిలో చాలా మంది పేదవారే కావడం బాధాకరం. కొందరికి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఉన్నా వారికి అవసరమైన పరికరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. పొలంలో సాగు చేయాలంటే నాగలి పట్టాలి, దుక్కి దున్నాలి. నాగలితో సాళ్లు దున్నాలంటే ఎడ్లు కావాలి. కానీ ఆ రైతుకు ఎడ్లు లేవు. ట్రాక్టరుతో దున్నించే స్తోమత అంతకన్నా లేదు. ఇలాంటి పరిస్థితిలో తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న కుమారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. తండ్రికి అండగా నిలిచి, కాడెడ్లుగా మారారు. కాడి మోసి, దుక్కి దున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు (Chittoor) జిల్లాలో జరిగింది.

వి.కోట మండలంలోని కుంబార్లపల్లె గ్రామానికి చెందిన సమీవుల్లా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. సమీవుల్లాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన వద్ద ఉన్న భామిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తరతరాలుగా వ్యవసాయం చేస్తుండటంతో తానూ వ్యవసాయంపైనే ఆధారపడ్డాడు. ఆదాయం అంతంత మాత్రమే కావడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలో చదివిస్తున్నాడు. కరోనా కారణంగా రెండేళ్లుగా తీవ్ర ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయాడు.

పంటకు పట్టిన తెగుళ్లకు మందులు సైతం కొనేందుకు డబ్బులు లేనంతగా.. దీంతో పొలం దున్నేందుకు ట్రాక్టర్ కాదుకదా కనీసం ఎడ్లనూ సమకూర్చుకోలేకపోయాడు. దీంతో చేసేది లేద తన పిల్లల సహాయంతో పొలం దున్ని సాగు చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..