Konaseema: కోనసీమలో హల్ చల్ చేస్తోన్న పాములు.. పాము కాటుతో ఒకరు మృతి.. భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు

|

Sep 27, 2022 | 9:35 AM

వరదలు తగ్గిన తర్వాత ఏర్పడిన బుదర, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోనసీమలోని పలు ప్రాంతాల్లో  పాములు హల్ చల్ చేస్తున్నాయి. మామిడికుదురు మండలంలోని బొమ్మిడి పాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న..

Konaseema: కోనసీమలో హల్ చల్ చేస్తోన్న పాములు.. పాము కాటుతో ఒకరు మృతి.. భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
Snake Hulchul In Konaseema
Follow us on

Konaseema: పాము కాటుతో కొబ్బరి వలపు కార్మికుడు మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పెదపట్నం లంక గ్రామంలో కొబ్బరి వలుపు కార్మికుడు గెడ్డం చంద్రరావు (67)ని పాము కాటువేసింది. కొబ్బరి రాశి దగ్గర కొబ్బరి కాయలను చంద్రరావు వలుస్తున్న సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. పాము కరిచిన వెంటనే స్థానికులు గెడ్డం చంద్రరావుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మరోవైపు వరదలు తగ్గిన తర్వాత ఏర్పడిన బుదర, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కోనసీమలోని పలు ప్రాంతాల్లో  పాములు హల్ చల్ చేస్తున్నాయి. మామిడికుదురు మండలంలోని బొమ్మిడి పాలెంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు ఇళ్లల్లోకి చేరుతున్నాయి. గ్రామంలోని ఇంటిలోనికి ఆరు అడుగుల తాచుపాము చొరబడింది. దీంతో కుంటుంబ సభ్యులు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.

తాచు పాముని కోటి అనే  దింపు కార్మికుడు చంపడం ఇష్టం లేక.. మానవత్వంతో దానిని చాకచక్యంగా పట్టుకుని.. కుండలో పెట్టి బంధించాడు. అనంతరం ఆ పాముని జాగ్రత్తగా నిర్మానుష ప్రాంతంలో వదిలేశాడు. అయితే ఈ కోతికి పాములు పట్టుకునే నైపుణ్యం లేదు. దీంతో ఇటువంటి సాహసాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోటి ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.