AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శృంగేరి పీఠం అధ్యాపకులు శ్రీ కైతేపల్లి సుబ్రహ్మణ్య శర్మ కుటుంబాన్ని పరామర్శించిన పీఠం ప్రతినిధులు

Shrungeri Sharada Peetham: శ్రీ శృంగేరి శారదా పీఠ పరిపాలిత శ్రీ వేద వేదాంత గురుకుల మహావిద్యాలయం (మాదిపాడు గుంటూరు జిల్లా)కు చెందిన అధ్యాపకులు శ్రీ కైతేపల్లి..

శృంగేరి పీఠం అధ్యాపకులు శ్రీ కైతేపల్లి సుబ్రహ్మణ్య శర్మ కుటుంబాన్ని పరామర్శించిన పీఠం ప్రతినిధులు
Subhash Goud
|

Updated on: Dec 15, 2021 | 4:04 PM

Share

Shrungeri Sharada Peetham: శ్రీ శృంగేరి శారదా పీఠ పరిపాలిత శ్రీ వేద వేదాంత గురుకుల మహావిద్యాలయం (మాదిపాడు గుంటూరు జిల్లా)కు చెందిన అధ్యాపకులు శ్రీ కైతేపల్లి సుబ్రహ్మణ్య శర్మ, ఐదుగురు వేద విద్యార్థులు కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జగద్గురువుల ఆదేశానుసారం శృంగేరీ శారదా పీఠం ప్రతినిధి శ్రీ కుప్పా శ్యామసుందర శర్మ బుధవారం నరసరావుపేటలో శ్రీ సుబ్రహ్మణ్య శర్మ తల్లి అనంతలక్ష్మిని, అలాగే వారి సోదరుడు భీమేశ్వర శాస్త్రిని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. సుబ్రహ్మణ్య శర్మ మాదిపాడు శాఖలో అందించిన విశిష్టమైన సేవలను, పాండిత్యాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం అనంతలక్ష్మికి శ్రీ శృంగేరి శారదా పీఠం తరపున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. అలాగే ఐదేళ్ల పాటు నెలకు రూ.2 వేల చొప్పున భృతిని కూడా అందించనున్నట్లు తెలిపారు.

ఇక మిగతా వారి కుటుంబాలకు వారి సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున, నెలకు రూ. 2 వేల చొప్పున ఐదు సంవత్సరాల పాటు నెలవారీగా భృతిని అందజేస్తామని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో శ్రీ శృంగేరి పీఠం ప్రతినిధులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ జి ఎల్ వి రమణ మూర్తి, నరసరావుపేట శ్రీ శృంగేరీ మఠ శాఖ కార్యనిర్వాహణాధికారి శ్రీ కే వి కే నాగరాజు, శ్రీ జి సుధీర్, శ్రీ పి గోపాలకృష్ణ భట్ తదితరులు సుబ్రహ్మణ్య శర్మ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

Tirupati: భ‌గ‌వ‌ద్గీత అఖండ పారాయ‌ణం.. పుల‌కించిన స‌ప్తగిరులు.. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌ని భ‌క్తులు

చాణక్య నీతి: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆచార్య చెప్పిన ఈ 4 విషయాలు ఎప్పుడు మర్చిపోకండి..

ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
దావోస్ వేదికపై సీఎం రేవంత్ ప్రతిపాదన..ప్రతి జులైలో హైదరాబాద్ లో
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
మంచి డిమాండ్‌ ఉన్న బిజినెస్‌.. కళ్లు చెరిగే ఆదాయం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఏపీ ప్రభుత్వం మరో కొత్త హైవే.. హైదరాబాద్ వెళ్లేవారికి ఊరట
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
ఎగ్జైటెడ్‌గా రామ్ చరణ్.. అభిమానులను మెప్పిస్తాడా?
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
1200 కోట్ల సినిమా.. దెబ్బకు కనిపించకుండా పోయిన హీరో.. మూడేళ్లకు..
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
శ్రేయస్‌కు నో ఛాన్స్.. 3వ స్థానంలో ఇషాన్ ఫిక్స్: సూర్యకుమార్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలో శని.. ఈ రాశులవారికి జాక్‌పాట్
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు