AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. మానవత్వం మరిచి.. మనుషులు కాలిపోయిన బూడిదలో బంగారం కోసం వెతుకులాట..

కర్నూల్ బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. 19 కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవడం ఎంతో బాధాకరం. అయితే ఈ విషాదం జరిగిన చోట కొందరు బంగారం కోసం వెతకడం కలకలం రేపింది. మీరేం మనుషులు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై పోలీసులు ఏమన్నారంటే..?

ఛీ.. ఛీ.. మానవత్వం మరిచి.. మనుషులు కాలిపోయిన బూడిదలో బంగారం కోసం వెతుకులాట..
Kurnool Bus Accident Gold Search
Krishna S
|

Updated on: Oct 31, 2025 | 12:18 PM

Share

కర్నూల్ బస్సు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఆప్తులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. బస్సు కాలిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రధాని దగ్గరి నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ బాధపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలు ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి బయటపడలేదు. అయితే ఇంతటి విషాదం జరిగిన చోట కొందరు అత్యంత దారుణంగా ప్రవర్తించారు.

బూడిదలో బంగారం

ప్రమాదంలో మనుషులు పూర్తిగా కాలిపోయారు. కానీ ప్రయాణికులు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు కరిగి ఆ బూడిదలో ఉంటాయని కొందరు దురాశ పడ్డారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు ఆ ప్రమాదం జరిగిన చోటుకు వచ్చాయి. వారు బస్సు కాలిపోయిన చోట ఉన్న బూడిదను సంచుల్లో నింపుకున్నారు. ఆ తర్వాత దాన్ని ప్రమాద స్థలానికి దగ్గరలోని ఒక కుంట వద్ద నీటిలో కడిగి.. అందులో బంగారం ముక్కలు ఏమైనా ఉన్నాయేమో అని వెతకడం మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో ఆగ్రహం

ఒకవైపు ఆ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని బాధను మిగిల్చగా, ఇలా బంగారంపై ఆశతో వచ్చి బూడిదను వెతుకుతుండటం నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. “ఛీ, మీరు అసలు మనుషులేనా?” అంటూ మండిపడుతున్నారు. మానవత్వం లేని ఈ చర్య తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఖండించిన పోలీసులు

పోలీసులు ఈ పుకార్లను ఖండించారు. ప్రమాదం జరిగిన రోజునే అన్ని అధికారిక పనులు పూర్తయ్యాయని, నిబంధనల ప్రకారం బస్సును ఆ ప్రదేశం నుంచి వెంటనే తరలించామని స్పష్టం చేశారు. ఎటువంటి విలువైన వస్తువులను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లలేదు” అని ఆయన అన్నారు. సంఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం లేదా దోపిడీ జరగలేదని ఆయన మరోసారి తెలిపారు. కొందరు స్థానికులు, కార్మికులు ప్రమాదంలో కాలిపోయిన బస్సు పరికరాలను మాత్రమే వెతికారని తెలిపారు. దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.