Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వింత దోపిడీ.. పీఎస్‌లో భారీ చోరీ చేసిన దొంగ పోలీసులు..!

|

Apr 01, 2023 | 6:29 AM

దొంగల సొత్తు పోలీసులు సీజ్‌ చేస్తే.. అక్కడ సొమ్ములు దొంగ పోలీసుల పాలయ్యాయంటా. ఈ వింత చోరీ కర్నూలులో జరిగింది. కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో సొత్తు మాయం కావడం సంచలనంగా మారింది. ఈకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబులే అని తేల్చారు.

Andhra Pradesh: కర్నూలు జిల్లాలో వింత దోపిడీ.. పీఎస్‌లో భారీ చోరీ చేసిన దొంగ పోలీసులు..!
Arrest
Follow us on

దొంగల సొత్తు పోలీసులు సీజ్‌ చేస్తే.. అక్కడ సొమ్ములు దొంగ పోలీసుల పాలయ్యాయంటా. ఈ వింత చోరీ కర్నూలులో జరిగింది. కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్‌లో సొత్తు మాయం కావడం సంచలనంగా మారింది. ఈకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. హెడ్ కానిస్టేబుల్ అమరావతి, కానిస్టేబుల్ రమణబాబులే అని తేల్చారు. అయితే ఇదే కేసులో ఓ సీఐని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఈ సొత్తును సీజ్ చేయగా.. ఇటీవల బదిలీపై వచ్చిన సీఐ ఈ సొత్తు మాయమైనట్లు గుర్తించారు.

కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర వాహనాలను SEB అధికారులు తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలో 2021 జనవరి 28న పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఓ కారు ఆపి తనిఖీ చేయగా.. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల దగ్గర భారీగా వెండి ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో 105 కిలోల వెండి ఆభరణాలు.. అలాగే రూ.2.05 లక్షల డబ్బులను సీజ్ చేశారు. ఈ సొత్తు మొత్తాన్ని అప్పటి కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ విక్రమ్‌సింహాకు అప్పగించారు. ఆయన తర్వాత పలువురు సీఐలు మారిపోయారు. కొందరు కానిస్టేబుల్స్‌ కూడా బదిలీ అయ్యారు.

గతేడాది మార్చిలో సీఐ శేషయ్య తాలుకా స్టేషన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చ్‌ 27న వెండి వ్యాపారులు ఇద్దరు కోర్టు నుంచి అనుమతి తీసుకుని.. ఆ వెండి, డబ్బుల కోసం కర్నూలు తాలుకా అర్బన్‌ స్టేషన్‌కు వచ్చారు. తమ సొత్తు తిరిగి అప్పగించాలని కోర్టు ఆర్డర్స్ అందజేశారు. దీంతో సీఐ రామలింగయ్య బీరువా తీశారు. అయితే వెండి, డబ్బులు లేకపోవడంతో అవాక్కయ్యారు. దీనికి కారణమైన వారిని గుర్తించారు. ఈరోజు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..