AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త చీర కొనలేదని.. ఇంట్లో ఉన్న చీరతో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

సత్యసాయి జిల్లాలో ఆశ్చర్యకరణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశంలో ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. కాలేజ్‌లో ఫ్రెషర్స్‌ పార్టీ కోసం తల్లిని కొత్త చీర అడగగా.. ఆర్థిక సమస్యలతో చీర కొనిచ్చేందుకు తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఇంట్లో ఉన్న పాతచీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

కొత్త చీర కొనలేదని.. ఇంట్లో ఉన్న చీరతో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
Andhra News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 06, 2025 | 8:46 PM

Share

ప్రస్తుత జనరేషన్ యూత్‌కు ప్రాణాలు అంటే భయం లేకుండా పోతుంది. ప్రేమలో విఫలమయ్యామని, ప్రేమించిన అమ్మాయి మాట్లాడట్లేదని, స్కూల్‌ టీచర్స్‌ తిట్టారని, ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని, అడిగిన వస్తువులు ఇవ్వలేదని ఇలా చిన్న చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇంటాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. తల్లి కొత్త చీర కొనివ్వలేదని ఇంటర్‌ విద్యార్థిని.. ఇంట్లో ఉన్న పాత చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం బాలాజీ నగర్‌కి చెందిన ఉష స్థానికంగా ఉన్న ఒక కాలేజ్‌లో ఇంటర్‌మీడియట్‌ చదువుతోంది. అయితే ఆమె చదువుతున్న కాలేజ్‌లో ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీకి తమ ఫ్రెండ్స్‌ అంత కొత్త డ్రెస్‌తో రావాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తాను కూడా కొత్త బట్టలు తీసుకోవాలని ఉష నిర్ణయించుకుంది. అదే విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లికి చెప్పింది. ఇంటర్ ఫస్టియర్‌లో కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులకు కాలేజీలోకి వెల్‌కమ్‌ పలుకుతూ ఇచ్చే ప్రెషర్స్‌ డే పార్టీకి.. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిలు చీరకట్టుతో వస్తున్నారని.. తనకు ఒక చీర కావాలని కొద్దిరోజులుగా ఇంటర్ విద్యార్థిని ఉష పదేపదే తల్లిని అడిగింది. అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. ఇప్పుడు కొత్త చీర కొనేందుకు డబ్బులు లేవని తల్లి చెప్పడంతో ఉషా ఒక్కసారిగా మనస్థాపానికి గురైంది.

ఫ్రెండ్స్‌ అందరూ కొత్త చీరలో వస్తారు.. తాను కొత్త చీర లేకుండా ప్రెషర్స్‌ పార్టీకి ఎలా వెళ్లాలి అనుకున్న ఉష సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాత చీర తీసుకొని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు వేలాడుతున్న బిడ్డను చూసి తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కొత్త చీర కొనివ్వలేదని చెప్పినందుకు కూతురు ఇంత పనిచేసిందా అని ఆ తల్లి కన్నీరు మున్నీరవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.