Andhra Pradesh: అచ్చం ‘పుష్ప’ సీనే.. పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్స్.. చివరకు ఏం జరిగిందంటే..

పోలీస్ వర్సెస్ స్మగ్లర్స్.. ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి పాల్పడ్డారు.. ఏకంగా పోలీస్ జీపునే ఢీకొట్టారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో చోటుచేసుంది. పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టగా.. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి.

Andhra Pradesh: అచ్చం ‘పుష్ప’ సీనే.. పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్స్.. చివరకు ఏం జరిగిందంటే..
Ap Crime News

Updated on: Apr 04, 2023 | 1:31 PM

పోలీస్ వర్సెస్ స్మగ్లర్స్.. ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి పాల్పడ్డారు.. ఏకంగా పోలీస్ జీపునే ఢీకొట్టారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో చోటుచేసుంది. పోలీసు వాహనాన్ని ఎర్ర చందనం స్మగ్లర్లు ఢీకొట్టగా.. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా స్మగ్లర్ల వాహనం తిరుపతి హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్ఐ నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన డక్కిలి పోలీసులు వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు.. ప్రయత్నించారు. స్మగ్లర్ల వాహనాన్ని ఛేజ్ చేసి.. వారిని అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు తమ కారుతో పోలీసు వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం దుండగులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. డక్కిలి సమీపంలోని మార్లగుంట వద్ద జీపును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సై నాగరాజుకు గాయాలయ్యాని పేర్కొన్నారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో కత్తులు, కొడవళ్ళు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

డక్కిలి ఎస్సైకు ముఖంపై గాయాలయ్యాయని.. వెంకటగిరిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..