Sajjala Ramakrishna Reddy: ఆ ముగ్గురూ నాన్ రెసిడెంట్ ఆంధ్రా.. దోచుకోవడానికే వారి ఆత్రం.. సజ్జల ఫైర్
చంద్రబాబు నాయుడు అయినా.. లోకేష్ అయినా.. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకు చెప్పడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం జరిగిన సభను చూస్తే వాళ్ల ముఖాల్లో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపించాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్.. ఈ ముగ్గురూ నాన్ రెసిడెంట్ ఆంధ్రా అంటూ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు నాయుడు అయినా.. లోకేష్ అయినా.. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకు చెప్పడం లేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. బుధవారం జరిగిన సభను చూస్తే వాళ్ల ముఖాల్లో నిరాశ నిస్పృహ స్పష్టంగా కనిపించాయంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్.. ఈ ముగ్గురూ నాన్ రెసిడెంట్ ఆంధ్రా అంటూ ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో ఉంటూ.. ఏపీని దోచుకోవాలనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల.. పవన్ కల్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. 2014లో టీడీపీకి మద్దతిచ్చి.. 2019లో ఎందుకు వ్యతిరేకించావ్.. అంటూ ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు బాగా పనిచేయలేదనే కదా! ఇప్పుడు బాబుని సీఎం చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నావ్! అంటూ విమర్శించారు. కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికే వారి ఆత్రం అంటూ సజ్జల ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా అభ్యర్థుల మార్పులపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కుప్పం స్థానానికి ఎందుకు మారారు? లోకేష్‌కు సంబంధంలేని మంగళగిరిలో ఎందుకు పోటీ చేయించారు? అంటూ ప్రశ్నించారు. బాబు నాయకత్వంపై నమ్మకముంటే టీడీపీలోనే పవన్ చేరొచ్చు కదా.. పవన్‌ను ఏపీ టీడీపీకి అధ్యక్షుడ్ని చేస్తే సరిపోతుంది.. అంటూ వ్యంగస్త్రాలు సంధించారు. చంద్రబాబు హయాంలో 30వేల ఉద్యోగాలిస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలిచ్చామని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు విశ్వసనీయత ఎంతో.. జగన్ విశ్వసనీయత ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసంటూ పేర్కొన్నారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై స్పందించిన సజ్జల.. జగన్ మరింత బెటర్ టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారంటూ పేర్కొన్నారు. బాబు ఆరోపిస్తున్నట్టుగా భయంతో అభ్యర్థుల్ని మార్చడం లేదన్నారు. మళ్లీ గెలుస్తామన్న పూర్తి నమ్మకంతోనే మార్పులు జరుగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు.
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..
తాడేపల్లిలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు వైసీపీ నేతలు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారీ కేక్‌ను కట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ.. ఈ రాష్ట్రానికి ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉండాలంటూ సజ్జల ఆకాంక్షించారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఏపీలో సంక్షేమ యజ్ఞం జరుగుతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే.. మళ్లీ జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి కావాలన్నారు. రాక్షసులంతా కలిసి జగన్‌పై దండెత్తుతున్నారంటూ బాబు, పవన్‌పై సెటైర్లేశారు. మారీచుల కుట్రల్ని చిత్తుచేసి జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందంటూ సజ్జల అభిప్రాయపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..