YS Viveka murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరు చేస్తున్న కామెంట్స్ హీట్ పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వివేకా కేసు దర్యాప్తు తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసులో విష ప్రచారం చేయడంతోపాటు.. సీబీఐ చార్జిషీట్‌లో కల్పిత కథలే కనిపించాయన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి..
వివేకా కేసులో బేసిక్ లాజిక్‌ను సీబీఐ మర్చిపోయిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కేసులో చంద్రబాబు చేయాల్సిదంతా చేశారని ఆరోపించారు. సునీత చెప్పినవన్నీ అబద్ధాలేన్నారు సజ్జల. భారతి, తాను సునీత ఇంటికి వెళ్లలేదని.. వివేకా హత్య జరిగిన పది రోజుల తర్వాత మాత్రమే తన భార్యతో కలిసి పరామర్శించడానికి వెళ్లానని గుర్తుచేశారు.
మొత్తంగా.. వివేకా మర్డర్ కేసు సీబీఐ కీలక విషయాలను పక్కన బెట్టిందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. రెండు సిట్‌లు తేల్చిన అంశాలను పట్టించుకోకుండా.. కాల్ రికార్డింగ్స్‌ను సీబీఐ పరిగణనలోకి తీసుకోకుండా.. వాంగ్మూలాలను ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారని సజ్జల ఆరోపించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..