Sajjala on Chandrababu Naidu: పేదలకు శాశ్వత గృహ హక్కు కల్పిస్తుంటే.. టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని వైసీసీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ సజ్జల మండిపడ్డారు. ఓటీఎస్ విషయంలో పేదలను ఎవరూ బలవంతం పెట్టడం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని.. ఆయన విమర్శలు అర్థరహితమంటూ సజ్జల తెలిపారు. 30 లక్షల మందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టించి ఇస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మరి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని సజ్జల స్పష్టంచేశారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం వడ్డీ కూడా మాఫీకి ఒప్పుకోలేదన్నారు. రుణం ఉన్నవారే రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రుణం లేకుంటే 10 రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని సజ్జల స్పష్టంచేశారు. ఈ పథకంలో బలవంతం ఏమి లేదు.. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందంటూ పేర్కొన్నారు. కావాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు.. వద్దు అనుకునే వాళ్ళు అలానే ఉంచుకోవచ్చన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం వాళ్లపై ప్రేమే ఉంటుందని.. చెయ్యాల్సిన మంచి చేస్తామంటూ సజ్జల స్పష్టంచేశారు. ప్రభుత్వం రాగానే ఉద్యోగులు అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చామన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగలేదని.. దీని కారణంగానే ఆలస్యం అయ్యిందన్నాన్నారు. త్వరలోనే సీఎం జగన్ పీఆర్సీ ప్రకటన చేస్తారని తెలిపారు. దీనిపై గ్రౌండ్ లెవల్ లో ఉన్న ఉద్యోగులంతా అన్ని గమనిస్తున్నారన్నారు. సీపీఎస్ పై వర్కవుట్ చేస్తున్నామని.. అన్ని పరిష్కరం అవుతాయని సజ్జల తెలిపారు. షేకావత్ కేంద్రమంత్రి ఎలా అయ్యాడో అర్ధం కావడం లేదని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలియకుండా అలాంటి ప్రకటనలు చెయ్యడం సరికాదన్నారు.
సుజనా చౌదరి, సీఎం రమేష్ ప్రభావం ఆయనపై పడిందని అనుకుంటున్నాని సజ్జల అనుమానం వ్యక్తంచేశారు. విపత్తుని మానవ తప్పిదమని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నిత్యం ఎన్ఎస్జీ గార్డ్స్ పెట్టుకుని తిరిగే చంద్రబాబు పక్క వాళ్ళ సెక్యూరిటి గురించి మాట్లాడటం హాస్యాస్పదమంటూ విమర్శించారు. సీఎం జగన్ తో ప్రజలు నవ్వుతూ మాట్లాడటాన్ని కూడా.. చంద్రబాబు తప్పుబట్టే స్థాయికి దిగజారారని సజ్జల విమర్శించారు.
Also Read:
Telangana Congress: బట్టి vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్‌లో కోల్డ్ వార్.. గందరగోళంలో క్యాడర్..
E-Pan Card: 10 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు..! ఎలా దరఖాస్తు చేయాలంటే..