Andhra Pradesh: నిండా పదిహేనేళ్ళు లేవు.. పెళ్ళి చేసుకునేందుకు పారిపోయి వచ్చేశారు.. సీన్‌ కట్‌ చేస్తే..!

వాళ్ళిద్దరూ పదో తరగతి విద్యార్దులు.. ఇంకా మైనారిటీ తీరలేదు.. 15 ఏళ్ళ లేత వయసులో ఘాటు ప్రేమలో పడిపోయారు. ఇంట్లో పెద్దలకు తెలిస్తే పెళ్ళి చేయరు. చదువు పేరుతో తామిద్దరినీ విడదీస్తారు. ఆ తరువాత కలవకుండా నిర్బంధం విధిస్తారు. ఇలా రకరకాల భయాలు, అపోహలతో లోకం పోకడ తెలియని ఆ ఇద్దరు మైనర్లు ఇంట్లో నుంచి పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు.

Andhra Pradesh: నిండా పదిహేనేళ్ళు లేవు..  పెళ్ళి చేసుకునేందుకు పారిపోయి వచ్చేశారు.. సీన్‌ కట్‌ చేస్తే..!
Love Couple
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Feb 21, 2024 | 8:23 PM

వాళ్ళిద్దరూ పదో తరగతి విద్యార్దులు.. ఇంకా మైనారిటీ తీరలేదు.. 15 ఏళ్ళ లేత వయసులో ఘాటు ప్రేమలో పడిపోయారు. ఇంట్లో పెద్దలకు తెలిస్తే పెళ్ళి చేయరు. చదువు పేరుతో తామిద్దరినీ విడదీస్తారు. ఆ తరువాత కలవకుండా నిర్బంధం విధిస్తారు. ఇలా రకరకాల భయాలు, అపోహలతో లోకం పోకడ తెలియని ఆ ఇద్దరు మైనర్లు ఇంట్లో నుంచి పారిపోయేందుకు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులును విడిచి వెళ్లిపోయి ప్రశాంతం కాపురం చేద్దామనుకున్నారు. అయితే వారీ ఫ్లాన్ సీన్ రివర్స్ అయ్యింది..!

పారిపోయి పెళ్ళి చేసుకుందామని కూడబలుక్కుని బస్సెక్కారు. బస్సు రాజమండ్రి నుంచి ఒంగోలుకు చేరుకుంది. తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. రైల్లో అయితే టికెట్‌ లేకుండా టిసి కళ్ళుకప్పి తిరుపతి దాకా వెళ్ళి అక్కడే గుళ్ళో పెళ్ళి చేసుకుందామని భావించారు. నేరుగా ఒంగోలు బస్టాండ్‌ నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

అక్కడ తిరుపతి వెళ్ళేందుకు ఏ రైలు వస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చినా చేతిలో చిల్లిగవ్వలేదు. టికెట్‌ లేకుండా ప్రయాణిస్తే పోలీసులు పట్టుకుని జైల్లో పెడతారేమో అన్న భయం ఒకవైపు. ఇలా రకరకాలుగా ఆలోచించిన ఆ మైనర్‌ జంట, చేసుకుంటే పెళ్ళి చేసుకోవాలి, లేదంటే రైలు కింద పడి ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి ప్రవర్తనను దూరం నుంచి గమనిస్తున్న ఒంగోలు రైల్వే ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్‌ కంట పడటంతో కథ అంతా అడ్డం తిరిగింది.

సీఐ శ్రీకాంత్ అనుమానం వచ్చి వారద్దరి దగ్గరకు చేరుకుని మాటల్లో పెట్టి విషయం రాబట్టారు. వారిద్దరికి ధైర్యం చెప్పి మైనారిటీ తీరని వయస్సులో చేసుకున్న పెళ్ళి చెల్లదని నచ్చజెప్పారు. చేసిన పొరపాటును తల్లిదండ్రులకు చెబితే క్షమిస్తారని, తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చని సూచించారు. అలా కాకుండా పారిపోతే సమాజంలో చెడు ప్రవర్తన కలిగిన వారి బారిన పడి జీవితాలు నాశనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఐ మంచి మాటలకు భవిష్యత్ కనిపించి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యింది ఆ జంట. దీంతో తాము ఇంటికి వెళతామని ఒప్పుకున్న ఆ మైనర్ జంటకు కౌన్సిలింగ్‌ నిర్వహించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు రైల్వే సిఐ శ్రీకాంత్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన 15 ఏళ్ళ మైనర్ బాలుడు, మరో 15 ఏళ్ళ మైనర్ బాలిక పదో తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పకుండా పారిపోయి రాజమండ్రి నుంచి ఒంగోలు దాకా బస్సులో వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఒంగోలు వరకే ఛార్జీలకు సరిపోయాయి. ఆ తరువాత ఏం చేయాలో పాలుపోక ఒంగోలు రైల్వే స్టేషన్‌కు చేరుకుని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. లేదా ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని ఒంగోలు రైల్వే స్టేషన్‌లో తచ్చాడుతున్నారు.

ఈ క్రమంలో రాబోయే ఎన్నికల సందర్భంగా సాధారణ తనిఖీల్లో విధులు నిర్వహిస్తున్న ఒంగోలు రైల్వే సీఐ శ్రీకాంత్‌బాబు కంటపడ్డారు. అనుమానంతో వారిని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. దీంతో వీరిద్దరికి కౌన్సిలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. బాలిక, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా అప్పటికే వీరిద్దరూ మిస్సింగ్‌ అయినట్టు ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌లో అమ్మాయి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.. దీంతో విషయాన్ని రైల్వే సిఐ శ్రీకాంత్‌ ఉండ్రాజవరం పియస్‌కు సమాచారం అందించి వీరిద్దరిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తమ పిల్లలు తెలిసీ, తెలియని వయస్సులో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చారని, వీరిని సరైన సమయంలో గుర్తించకుంటే ఆత్మహత్య చేసుకునే వారని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. సకాలంలో వీరిని గుర్తించి తమకు సురక్షితంగా అప్పగించిన రైల్వే సిఐ శ్రీకాంత్‌కు, ఇతర రైల్వే పోలీసులకు మైనర్ల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!