Andhra Pradesh: అమ్మో చిరుత.. హడలిపోయిన స్థానికులు.. అసలు విషయం తెలిసి షాక్!
నిర్మానుష్య ప్రాంతం.. జనసంచారం లేదు. కాని కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. వాటి గోల ఆర్తనాదాలుగా మారి సమీప జువ్వలపాలెం రోడ్డు వరకు వినిపించింది. దీంతో అటుగా వెళ్లే కొందరు పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. వారి కళ్లు ముందు చనిపోయిన ఓ కుక్క కళేబరం కనిపించింది. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో వారికి అర్ధం కాలేదు.

నిర్మానుష్య ప్రాంతం.. జనసంచారం లేదు. కాని కుక్కలు పెద్దగా అరుస్తున్నాయి. వాటి గోల ఆర్తనాదాలుగా మారి సమీప జువ్వలపాలెం రోడ్డు వరకు వినిపించింది. దీంతో అటుగా వెళ్లే కొందరు పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. వారి కళ్లు ముందు చనిపోయిన ఓ కుక్క కళేబరం కనిపించింది. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో వారికి అర్ధం కాలేదు. అంతలోనే వారికి షాక్ కొట్టినంత పనైంది. దూరంగా ఒక జామాయిల్ చెట్టు పైన చారలతో ఒక జంతువు కనిపించింది.
అక్కడ ఉన్నవారిలో టెన్షన్ మొదలైంది. పారిపోదమని ఇంతలో ఒకతను సలహా ఇచ్చాడు. అందరూ రెండు అడుగులు వెనక్కు చేశారు. వారిలో ఓ వ్యక్తి తన జేబులో ఫోన్ తీసి ఆ జంతువు ను వీడియో తీశాడు. ఒక్కసారిగా జామాయిల్ చెట్టు నుంచి దూకిన జంతువు కనిపించకుండా పోయింది. ఈ వీడియో వైరల్ కావటంతో అందరూ దాన్ని చిరుత పులి వచ్చిందనుకోవటం మొదలు పెట్టారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శింగలూరివారి వీధి ప్రాంతంలో జరిగింది.
అయితే అటవీ ప్రాంతం కాకపోవడంతో పాటు పగ్ మార్క్ తేడాగా ఉండటంతో దాన్ని అడవి పిల్లిగా తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదివారుగా ఒక్కోసారి తాడు సైతం మనకు పాములా కనిపిస్తుంది. పరికించి, పరీక్షించి చూస్తే తప్పా అసలు విషయం తెలియదు..!
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



