West Godavari News: బంగారు గుడ్లు పెట్టే బాతు కథ మనలో చాలా మందికి తెలుసుకదా . అత్యాశకు పోతే చివరకు దక్కేది కూడా దక్కకుండా పోతుందనేది ఇందులోని నీతి. అయితే ఈ కథ తెలిసిన వాళ్లు సైతం తమలో ఉన్న అత్యాశను చంపుకోలేక పోతున్నారు. ఇలాంటి అత్యాశతోనే ఓ దొంగ ఏకంగా ఏటీఎంపైనే కన్నేశాడు. కానీ ఆ సమయానికి అలారం మోగటంతో అధికారులు అప్రమత్తమై చోరికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొణితవాడలో.. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఏటీఎంను పగలగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించాడు దొంగ.
అయితే ఏటీఎం పగలగొట్టగానే హైదరాబాద్‌లోని కంట్రోల్ రూంలో అలారం మోగడంతో బ్యాంక్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే ఎస్‌బీఐ కంట్రోల్ రూమ్ నుంచి వీరవాసరం పోలీసులకు సమాచారం అందించారు. అంతే తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పారిపోతున్న దొంగను పెట్టుకున్నారు పోలీసులు. ఏటీఎం మిషన్ పగలకొడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. చోరీకి ప్రయత్నించిన దొంగ వీరవాసరం మండలం బుదారాయుడు చెరువుకు చెందిన పెంటకోటి అప్పాజీగా పోలీసులు గుర్తించారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి, గాలికి తిరుగుతూ దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.