Republic Day 2024: కడియం పల్ల వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే సందడి.. పూలతో ప్రత్యేక అలంకరణ..

పూలతో గర్వంగా విచ్చుకుంటూ.. 75వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపాయి పలు రకాల పూల మొక్కలు. మువ్వన్నెల రంగులతో సీతాకోకచిలుక ఎగురుతున్నట్లుగా నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ వినయ్ లు సందేశాత్మకమైన కూర్పును తీర్చిదిద్దారు. గొంగళి నుండి ఎన్నో దశలు మార్చుకొని పంచె వన్నెల సీతాకోక చిలుకలా భారత్ ప్రయాణం అందంగా మార్చబడింది

Republic Day 2024: కడియం పల్ల వెంకన్న నర్సరీలో రిపబ్లిక్ డే సందడి.. పూలతో ప్రత్యేక అలంకరణ..
Palla Venkanna Nursery
Follow us
Pvv Satyanarayana

| Edited By: Surya Kala

Updated on: Jan 26, 2024 | 11:18 AM

బ్రిటిష్ పాలన లో 200 ఏళ్ల తర్వాత బానిస శృంఖలాలను చీల్చుకొని స్వాతంత్రం పొందిన మన దేశం  సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ ఆవరించిన రోజు 1950  జనవరి 26వ తేదీ. నాటి నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సు దినం రిపబ్లిక్ డే ను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్చా వాయువులు నిండిన మేరా భారత్ మహాన్ అంటూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు విచ్చుకున్నాయి. రిపబ్లిక్ డే సందేశాన్ని అందించారు కడియం పల్లా వెంకన్న రైతు.

పూలతో గర్వంగా విచ్చుకుంటూ.. 75వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపాయి పలు రకాల పూల మొక్కలు. మువ్వన్నెల రంగులతో సీతాకోకచిలుక ఎగురుతున్నట్లుగా నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ వినయ్ లు సందేశాత్మకమైన కూర్పును తీర్చిదిద్దారు. గొంగళి నుండి ఎన్నో దశలు మార్చుకొని పంచె వన్నెల సీతాకోక చిలుకలా భారత్ ప్రయాణం అందంగా మార్చబడిందనీ నర్సరీ అధినేత పల్ల సత్యనారాయణ మూర్తి అన్నారు. ఈ కూర్పు కడీయపు లంక నర్సరీ సందర్శకులకు ఇది వేడుకగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..