AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక.. రెండు చోట్ల కొనసాగుతున్న రీపోలింగ్..

ఉద్రిక్తతలు, నిరసనల మధ్యే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన రీపోలింగ్.. సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Andhra Pradesh: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక.. రెండు చోట్ల కొనసాగుతున్న రీపోలింగ్..
Pulivendula Zptc
Krishna S
|

Updated on: Aug 13, 2025 | 7:45 AM

Share

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. జడ్పీటీసీ ఎన్నికలో భాగంగా భారీ బందోబస్తు, ఎన్నో గొడవలు, అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. ఎట్టకేలకు పలు ఉద్రిక్తల మధ్య పోలింగ్ ముగిసింది. కానీ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆ చోట్ల రీపోలింగ్ జరుగుతుంది. 3, 14 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5గంటల వరకు సాగనుంది. ఈ రెండు పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి ఫిర్యాదుతో ఈసీ రీపోలింగ్‌కి ఆదేశించింది. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

కాగా మంగళవారం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఘర్షణలు, ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ జరిగింది. పులివెందులలో 76.44శాతం, ఒంటిమిట్టలో 81.53శాతం పోలింగ్ నమోదైంది. రేపు కౌంటింగ్ జరగనుండడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ రెండు స్థానాలను వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులను నిలబెట్టుకోవాలని వైసీపీ.. ఎలాగైన జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని టీడీపీ ప్రణాళికలు రచించాయి. ఈ పార్టీల ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..