Tirupati: తిరుపతికి వచ్చే యాత్రికులకు మరో కొత్త అనుభూతి.. ఈ ఏడాది ఆఖరికల్లా అందుబాటులోకి..!

| Edited By: Balaraju Goud

Sep 06, 2024 | 12:28 PM

తిరుపతి రైల్వే స్టేషన్. ఎప్పటి నుంచో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి జరగబోతుందని వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు అది సాకారం కాబోతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ తలమానికంగా నిలవబోతోంది.

Tirupati: తిరుపతికి వచ్చే యాత్రికులకు మరో కొత్త అనుభూతి.. ఈ ఏడాది ఆఖరికల్లా అందుబాటులోకి..!
Tirupati Railway Station
Follow us on

తిరుపతి రైల్వే స్టేషన్. ఎప్పటి నుంచో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి జరగబోతుందని వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు అది సాకారం కాబోతోంది. తిరుపతి రైల్వే స్టేషన్ తలమానికంగా నిలవబోతోంది. రూ. 300 కోట్ల అభివృద్ధి పనులతో అత్యాధునిక సౌకర్యాలను అందించబోతోంది. తిరుమలకు వచ్చే భక్తులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఏడాదికి 6 కోట్ల మంది యాత్రికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలోనే అందుబాటులోకి రానుంది.

దాదాపు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరి కంతా అత్యాధునిక సేవలతో తిరుపతి రైల్వే స్టేషన్ కొంత భాగం అందుబాటులోకి రాబోతోంది. 2022 ఆగస్టులో ప్రారంభమైన తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ఢిల్లీకి చెందిన వరిందేర కన్‌స్ట్రక్చర్ పూర్తి చేస్తోంది. ఈ ఏడాది ఆఖరి నాటికి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి కానున్నాయి. ఇందులో భాగంగానే తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రైల్వే స్టేషన్ మోడ్రైజేషన్ పనులపై రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సౌత్ సైట్ స్టేషన్ బిల్డింగ్ తోపాటు జీ ప్లస్ త్రీ భవనంలో ఎయిర్ కాన్ కోర్సెస్, ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

రైల్వే స్టేషన్ సౌత్ సైడ్‌లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియా తో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్ కాన్ కోర్స్ రానున్నాయి. బేస్మెంట్ లో 200 ఫోర్ వీలర్స్, 300 కు పైగా టూ వీలర్స్ కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటిదాకా రూ.143.68 కోట్లు ఖర్చు చేసి దాదాపు 56 శాతం పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫిమేల్ వెయిటింగ్, ఏరియా ఫుడ్ కోర్ట్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులను చేపట్టింది. థర్డ్ ఫ్లోర్ లో రన్నింగ్ రూమ్, టిటీఈలకు రెస్ట్ రూములు, రైల్వే ఆఫీసులుతోపాటు 8 లిఫ్టులు, 2 ఎస్కలేటర్లను నిర్మిస్తోంది.

ఇలా తిరుమలకు వచ్చే యాత్రికులకు కొత్త అనుభూతిని కలిగించేలా జరుగుతున్న అభివృద్ధి పనుల పై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతి, రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లపై రైల్వే ఇంజనీరింగ్ తో చర్చించారు. 6 ప్లాట్ ఫామ్ లు, ఫిట్ ఏరియాలను తనిఖీ చేశారు. ప్రస్తుతం 90 రైళ్ల రాకపోకలు, దాదాపు 90 వేల మంది యాత్రికులకు సేవలందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోడ్రైజేషన్ తో రోజూ 1.50 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది.

ఇక తిరుపతి రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి జరుగుతోందన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ సిఎం జగన్ ప్రోత్సాహంతో సాధ్యమైందన్నారు. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా మారబోతోందన్న ఎంపీ ఇప్పటికే సౌత్ బ్లాక్ పూర్తి అయ్యిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి తిరుపతి కొచ్చే యాత్రికులు, ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుందన్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మధ్య అనుసంధానంగా స్కై వాక్ రాబోతుందన్నారు ఎంపీ. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు రోప్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని 2 వేల మంది రోప్ ద్వారా వెళ్ళేలా చర్యలు తీసుకున్నట్లు ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..